JHCHBS | భవన్స్‌లో ఎన్నికలు.. బౌన్సర్ల పహారాలో జూబ్లీహిల్స్ క్లబ్
JHCHBS | హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని (Jubilee Hills) భారతీయ విద్యా భవన్ స్కూల్‌లో సినీ, రాజకీయ ప్రముఖులు సందడి చేస్తున్నారు. జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ (JHCHBS) ఎన్నికలు జరుగుతుండటమే దీనికి కారణం.
JHCHBS | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని (Jubilee Hills) భారతీయ విద్యా భవన్ స్కూల్‌లో సినీ, రాజకీయ ప్రముఖులు సందడి చేస్తున్నారు. జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ (JHCHBS) ఎన్నికలు జరుగుతుండటమే దీనికి కారణం. ఆసియాలోనే బెస్ట్ ఎలైట్ సొసైటీగా పేరొందిన దీనిలో మొత్తం 4039 ఓట్లు ఉన్నాయి. 1160 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కాలనీలో 80 శాతం నివాసితులు కోటీశ్వరులే కావడం విశేషం. ఈ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి జూ బొల్లినేని రవీంద్రనాథ్, బొల్లినేని శీనయ్య ప్యానెళ్లు పోటీ పడుతున్నాయి. భారతీయ విద్యాభవన్‌లో (Bharatiya Vidya Bhavan) ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రముఖులు వచ్చే జూబ్లీహిల్స్ క్లబ్ (Jubilee Hills Club) బౌన్సర్ల పహారలో ఉన్నది. సుమారు 20 మంది బౌన్సర్లు (Bouncers) జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఉన్నారు. దీంతో ఇదికాస్తా వివాదాస్పదమైంది.

ఈ ఎన్నికల్లో పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వీవీఐపీలు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపార దిగ్గజాలు ఓటు హక్కు వినియోగించుకోనున్నాయి. ఓటు హక్కు కలిగిన వారిలో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy), ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సినీ హీరోలు చిరంజీవి, నాగార్జున, మహేష్‌బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ పాటు నిర్మాత నాగవంశీ, ఏషియన్ మూవీస్ సునీల్ నారంగ్, జస్టిస్ చలమేశ్వర్, జ్యువెలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ కౌశిక్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, హెటిరో డ్రగ్స్ పార్థసారధి రెడ్డి, ఎంఎస్‌ఎన్ ఫార్మా అధినేతి, దివీస్ ల్యాబ్స్ అధినేతతో, ప్రముఖ బిల్డర్లు డీఎస్‌ఆర్, జీవీపీఆర్, కేఎన్‌ఆర్‌లతో పాటు తాజా మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ప్రముఖ వ్యాపారులు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. ఇలా మొత్తం 4039 మంది ఓటర్లలో 1656 మంది వీవీఐపీలే. ఇందులో 95 మంది మల్టీ మిలీయనర్లు, 68 మంది భారతదేశ టాప్ 100 ధనవంతుల్లో ఉన్నవారు కావడం గమనార్హం.
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి






