Covid 19 | ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కలకలం.. కడప జిల్లాలో ఇద్దరు మృతి
Covid 19 | ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కరోనా కేసులు (Corona Virus) మళ్లీ కలకలం సృష్టిస్తున్నాయి. కడప జిల్లాకు (Kadapa) చెందిన ఇంద్దరు కోవిడ్‌తో (Covid 19) చనిపోయారు.
Covid 19 | త్రినేత్ర.న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కరోనా కేసులు (Corona Virus) మళ్లీ కలకలం సృష్టిస్తున్నాయి. కడప జిల్లాకు (Kadapa) చెందిన ఇంద్దరు కోవిడ్‌తో (Covid 19) చనిపోయారు. దీంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్రమత్తమైన అధికారులు మృతులిద్దరికీ ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లో పాజిటివ్ అని తేలడంతో తదుపరి నిర్ధారణ పరీక్ష కోసం వారి నమూనాలను మహారాష్ట్రలోని పుణె వైరాలజీ ల్యాబ్‌కు పంపడానికి కడప జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, మృతుల్లో ఒకరికి 43 ఏండ్లు, మరొకరికి 60 ఏండ్లపైనే ఉన్నాయని తెలిసింది. 43 ఏండ్ల వ్యక్తి కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందగా, మరొకరు తమిళనాడులోని సీఎంసీ వెల్లూరులో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో కడప జిల్లా వైద్యాధికారులు వెల్లూరు సీఎంసీతో సంప్రదించి అక్కడ మృతి చెందిన వ్యక్తి నమూనాలు సేకరించనున్నారు.
గతేడాది కూడా ఏపీలో కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. 2025, మే నెలలో నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన 75 ఏండ్ల మహిళ అనారోగ్యంతో కడప రిమ్స్‌లో చేరారు. వృద్ధురాలికి తీవ్ర జ్వరం ఉండటంతో అనుమానించిన వైద్యులు కరోనా పరీక్షలు చేశారు. అందులో ఆమెకు పాజిటివ్ రావడంతో కరోనా సోకినట్లు నిర్ధారించారు. అప్పటికే విశాఖపట్నంలో కూడా ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా తేలింది. మళ్లీ ఏడాది తర్వాత కడప జిల్లాలోనే కోవిడ్ కేసులు వెలుగు చూడటం గమనార్హం.
సంబంధిత వార్తలు

Covid-19 | మళ్లీ విస్తరిస్తున్న కరోనా మహమ్మారి.. నెల రోజుల్లో 13 మందికి పాజిటివ్.. నలుగురు మృతి
జులై 17, 2026

RS Praveen Kumar vs Nara Lokesh | రేవంత్ చేతులెత్తేశాకే ఆ లొంగుబాటు.. నారా లోకేష్‌కు ఆర్ఎస్ ప్రవీణ్ స్ట్రాంగ్ రిప్లై!
జులై 15, 2026

Mudragada Padmanabham | అధికార లాంఛనాలతో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు
జులై 15, 2026
తాజావార్తలు
- ●ISRO Apprentice | ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో అప్రెంటిస్‌లు.. రాత పరీక్ష లేకుండానే..
- ●Horoscope | జూలై 19 రాశి ఫలాలు.. మీ కోపం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం!
- ●Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక
- ●Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!
- ●Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి

ISRO Apprentice | ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో అప్రెంటిస్‌లు.. రాత పరీక్ష లేకుండానే..

Horoscope | జూలై 19 రాశి ఫలాలు.. మీ కోపం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం!

Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక

Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!



