Stock Markets | స్టాక్ మార్కెట్‌లకు ఊరట.. భారీ పతనం తర్వాత సెన్సెక్స్, నిఫ్టీ రికవరీ..
Stock Markets | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవ్వగా గురువారం కాస్త కోలుకున్నాయి. గత 3 నెలల కాలంలో అత్యంత భారీ నష్టాన్ని మార్కెట్లు బుధవారం ఎదుర్కొన్నాయి. అయితే మార్కెట్ల పట్ల పెట్టుబడిదారులు పాజిటివ్ ధోరణిలో ఉన్నారు.
Stock Markets | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవ్వగా గురువారం కాస్త కోలుకున్నాయి. గత 3 నెలల కాలంలో అత్యంత భారీ నష్టాన్ని మార్కెట్లు బుధవారం ఎదుర్కొన్నాయి. అయితే మార్కెట్ల పట్ల పెట్టుబడిదారులు పాజిటివ్ ధోరణిలో ఉన్నారు. ముఖ్యంగా ఎఫ్ఐఐల కొనుగోళ్లు క్రమంగా పెరుగుతుండడంతో మార్కెట్లు అంత భారీ మొత్తంలో పతనం అయినప్పటికీ గురువారం కోలుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ బుధవారం 76,503.60 వద్ద ముగియగా, గురువారం 76,576.14 వద్ద ప్రారంభమైంది. ఉదయం సెషన్‌లో 482.36 పాయింట్లు (0.63 శాతం) పెరిగి 76,985.96 వద్ద ట్రేడైంది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 సూచీ 23,928.95 వద్ద ప్రారంభమై 137.10 పాయింట్లు (0.57 శాతం) లాభపడి 24,019.15 వద్ద కొనసాగింది.
తాత్కాలిక ఉద్రిక్తతలతో నష్టం ఉండదు..
ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరగడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో కాల్పుల విరమణ ముగిసిందని ప్రకటించడం, అనంతరం అమెరికా తాజా సైనిక దాడులు చేపట్టడంతో భౌగోళిక ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 79 డాలర్లకు చేరగా, దిగుమతులపై ఆందోళనల నేపథ్యంలో భారత రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే 95.5 స్థాయికి బలహీనపడింది. ఇది నెల రోజుల కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వీకే విజయకుమార్ మాట్లాడుతూ భౌగోళిక ఉద్రిక్తతలు మరోసారి భారత మార్కెట్‌లకు ఆటంకంగా మారాయని తెలిపారు. బ్రెంట్ క్రూడ్ ధరలు సుమారు 80 డాలర్లకు చేరుకోవడంతో మార్కెట్లో ఆందోళనలు పెరిగాయని అన్నారు. అయితే ఈ ఉద్రిక్తతలు తాత్కాలికంగా కొనసాగితే మార్కెట్లు వేగంగా రికవర్ అవుతాయని, లేదంటే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతాయని అన్నారు.
లాభాల్లో వినియోగ, పారిశ్రామిక రంగాలు..
గురువారం నిఫ్టీ 50లో వినియోగ, పారిశ్రామిక రంగాలకు చెందిన షేర్లు లాభాల్లో నిలిచాయి. జొమాటో మాతృసంస్థ ఎటర్నల్ 3.37 శాతం పెరిగి 296.35కు చేరింది. టైటాన్ 1.98 శాతం లాభంతో 4,661.80 వద్ద ట్రేడైంది. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 1.26 శాతం పెరిగి 3,174.30కు చేరగా, భారతి ఎయిర్‌టెల్ 1.24 శాతం లాభంతో 1,911.60 వద్ద కొనసాగింది. కోల్ ఇండియా కూడా 1.19 శాతం పెరిగి 434.15కు చేరింది. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగ షేర్లు మాత్రం ఒత్తిడిలోనే కొనసాగాయి. ఆర్థిక సంవత్సరం 2026-27 తొలి త్రైమాసిక ఫలితాలను టీసీఎస్ ప్రకటించనున్న నేపథ్యంలో, ప్రపంచ ఖాతాదారుల డిస్క్రిషనరీ టెక్నాలజీ వ్యయాలపై మార్కెట్ దృష్టి కేంద్రీకరించింది. టీసీఎస్ 1.47 శాతం పడిపోయి 2,027.30 వద్ద ట్రేడైంది. ఇన్ఫోసిస్ 2.17 శాతం తగ్గి 1,046.10కు చేరి ఐటీ రంగంలో అత్యధిక నష్టాన్ని నమోదు చేసింది. టెక్ మహీంద్రా 1.60 శాతం తగ్గి 1,406.00కు చేరగా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 1.54 శాతం పడిపోయి 1,128.00 వద్ద ట్రేడైంది. నిఫ్టీలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ 2.43 శాతం క్షీణించి 1,316.20 వద్ద ముగియడంతో ఫార్మా రంగంలో ఇటీవల నమోదైన ర్యాలీకి బ్రేక్ పడింది.
ప్రపంచ మార్కెట్లలో మిశ్రమ స్పందన..
ప్రపంచ మార్కెట్లలో అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో డౌ జోన్స్ 1.09 శాతం పడిపోయింది. ఎస్ అండ్ పీ 500 సూచీ 0.3 శాతం తగ్గింది. అయితే బ్రాడ్‌కామ్, యాపిల్‌తో 30 బిలియన్ డాలర్ల చిప్ సరఫరా ఒప్పందం కుదుర్చుకోవడంతో నాస్‌డాక్ 0.2 శాతం స్వల్ప లాభంతో ముగిసింది. గురువారం ఉదయం ఆసియా మార్కెట్లు కూడా ప్రధానంగా లాభాల్లో ట్రేడవుతూ భారత మార్కెట్‌లకు మద్దతు ఇచ్చాయి. మార్కెట్ ప్రారంభానికి ముందు గిఫ్ట్ నిఫ్టీ సుమారు 23,959 వద్ద, 81 పాయింట్ల లాభంతో ట్రేడైంది.
సంబంధిత వార్తలు

Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఒక్క రోజులోనే రూ.6 లక్షల కోట్లు లాభం..
జులై 10, 2026

Stock Markets | టీసీఎస్ ఫలితాల జోష్.. భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..
జులై 10, 2026

Stock Markets | భారీ పతనం అనంతరం.. కాస్త కోలుకున్న స్టాక్ మార్కెట్లు, తగ్గిన చమురు ధరలు..
జులై 9, 2026
తాజావార్తలు
- ●Parliament All Party Meeting | పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పీఎం, సీఎంల పదవులు ఊడే కొత్త బిల్లు
- ●DMK vs TVK | కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది.. సీఎం విజయ్‌తో రాజీ లేదు: భగ్గుమన్న డీఎంకే
- ●MLA Jagadish Reddy | భద్రాచలం మునిగిపోతుందా..? చర్చకు సిద్ధమా ఉత్తమ్ కుమార్ రెడ్డి..? : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
- ●Sai Pallavi | 25 కోట్ల బడ్జెట్ - ఐదు కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ
- ●Argentina vs Switzerland | ఎక్స్ట్రా టైమ్‌లో విశ్వరూపం: స్విట్జర్లాండ్‌ను చిత్తు చేసి సెమీస్‌కు దూసుకెళ్లిన అర్జెంటీనా!
- ●Trekking in Ananthagiri | అనంతగిరి ట్రెక్కింగ్‌లో విషాదం.. హైదరాబాద్‌కు చెందిన టీచర్ మృతి

Parliament All Party Meeting | పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పీఎం, సీఎంల పదవులు ఊడే కొత్త బిల్లు

DMK vs TVK | కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది.. సీఎం విజయ్‌తో రాజీ లేదు: భగ్గుమన్న డీఎంకే

MLA Jagadish Reddy | భద్రాచలం మునిగిపోతుందా..? చర్చకు సిద్ధమా ఉత్తమ్ కుమార్ రెడ్డి..? : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

Sai Pallavi | 25 కోట్ల బడ్జెట్ - ఐదు కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ



