Hyderabad | యూట్యూబ్ నేర్పిన మద్యం తయారీ.. 502 బాటిళ్లతో పోలీసులకు చిక్కిన ఆంటోనీ
Hyderabad | ఇటీవలి కాలంలో చాలా మంది యూట్యూబ్‌ను ఫాలో అవుతున్నారు. ఏ సమస్య వచ్చినా, ఏ కొత్త వంట చేయాలన్నా, ఇంకేదో చేయాలనుకున్నా.. క్షణాల్లోనే యూట్యూబ్‌లో శోధిస్తారు. ఓ వ్యక్తి కూడా మద్యాన్ని ఎలా తయారు చేయాలో యూట్యూబ్‌లో చూశాడు.
Hyderabad | త్రినేత్ర.న్యూస్ : ఇటీవలి కాలంలో చాలా మంది యూట్యూబ్‌ను ఫాలో అవుతున్నారు. ఏ సమస్య వచ్చినా, ఏ కొత్త వంట చేయాలన్నా, ఇంకేదో చేయాలనుకున్నా.. క్షణాల్లోనే యూట్యూబ్‌లో శోధిస్తారు. ఓ వ్యక్తి కూడా మద్యాన్ని ఎలా తయారు చేయాలో యూట్యూబ్‌లో చూశాడు. ఇంకేముంది.. ఆ ప్రకారమే అక్రమంగా మద్యం తయారు చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని కాప్రాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కాప్రాకు చెందిన ఆంటోనీ పీటర్ అక్రమంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. దీంతో యూట్యూబ్‌లో మద్యం తయారీ గురించి పలు వీడియోలను చూశాడు. అనంతరం అందుకు సంబంధించిన వస్తువులను, పదార్థాలను సేకరించాడు. ద్రాక్ష, పైనాపిల్, జామ, ముసాంబి, సపోటా, అరటితో పాటు తమలపాకుతో మద్యం తయారు చేయడం ప్రారంభించాడు. ఇక 750 మి.లీ. మద్యం బాటిల్‌ను రూ. 300 చొప్పున విక్రయించి ఆదాయం గడిస్తున్నాడు.
ఈ విషయం ఆ నోటా ఈ నోటా.. పోలీసులకు, ఎక్సైజ్ అధికారుల దాకా చేరింది. పక్కా సమాచారంతో ఎక్సైజ్ అధికారులు ఆంటోనీ ఇంటిపై దాడి చేశారు. 377.7 లీటర్ల మద్యంతో పాటు 502 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ మద్యం విలువ రూ. 1.5 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
సంబంధిత వార్తలు

YouTube | యూట్యూబ్‌లో భారీ మార్పులు.. ఏఐతో వీడియో ఎడిటింగ్, లైవ్ డబ్బింగ్..
సెప్టెంబర్ 25, 2026

CP Ramesh admire to Shashikumar | శభాష్ శశికుమార్.. నీ మానవత్వం ఎందరికో స్ఫూర్తి
సెప్టెంబర్ 24, 2026

Ganesh Laddu Auction | కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో రూ.కోటి పలికిన గణేశ్ లడ్డూ వేలం..
సెప్టెంబర్ 24, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan | ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు.. కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా బొంతు రామ్మోహన్ నియామకం
- ●Rats Bit Female Students | గురుకుల పాఠశాలలో దారుణం.. 14 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు
- ●Landslides Hit Sikkim | సిక్కింలో వరదలు.. గ్రామంపై విరిగిపడ్డ కొండచరిలు
- ●NSE Share Price | నిరాశ పరిచిన ఎన్ఎస్ఈ షేర్లు.. స్వల్పంగా పతనం.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచనలు..
- ●ED Notices to Arikepudi Gandhi | ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి బిక్ షాక్.. నోటీసులు జారీ చేసిన ఈడీ
- ●Muslim Marriages | ముస్లిం వివాహాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. కొత్త చట్టానికి అస్సాం కేబినెట్ ఆమోదం

Bonthu Rammohan | ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు.. కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా బొంతు రామ్మోహన్ నియామకం

Rats Bit Female Students | గురుకుల పాఠశాలలో దారుణం.. 14 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు

Landslides Hit Sikkim | సిక్కింలో వరదలు.. గ్రామంపై విరిగిపడ్డ కొండచరిలు

NSE Share Price | నిరాశ పరిచిన ఎన్ఎస్ఈ షేర్లు.. స్వల్పంగా పతనం.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచనలు..



