Hyderabad | స్కూల్ బస్సు డ్రైవర్లకు బ్రీత్ లైజర్ టెస్టు తప్పనిసరి..!
Hyderabad | హైదరాబాద్ నగరంలోని స్కూల్ విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రయివేటు పాఠశాలల బస్సు డ్రైవర్లకు బ్రీత్ లైజర్ టెస్టును తప్పనిసరి చేశారు ట్రాఫిక్ పోలీసులు.
Hyderabad | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలోని స్కూల్ విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రయివేటు పాఠశాలల బస్సు డ్రైవర్లకు బ్రీత్ లైజర్ టెస్టును తప్పనిసరి చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఉదయం బస్సు ఎక్కే ముందే ఆయా పాఠశాలల యాజమాన్యాలు తమ డ్రైవర్లకు తప్పనిసరిగా బ్రీత్ లైజర్ టెస్టులు చేయాలని, ఆ తర్వాతనే డ్రైవింగ్‌కు అనుమతించాలని పోలీసులు ఆదేశించారు. ఇలా చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉండదని, పిల్లలకు కూడా భద్రత ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.
అవసరమైతే బస్సు డ్రైవర్లకు పోలీసులు కూడా టెస్టులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులకు పాఠశాలల యాజమాన్యాలు సహకరించాలని సూచించారు. ప్రయివేటు పాఠశాలల బస్సు డ్రైవర్లతో పాటు ఆటో డ్రైవర్లు కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థులతో పాటు డ్రైవర్లు కూడా ట్రాఫిక్ నిబంధనలను ఫాలో కావాలన్నారు. రవాణా భద్రత నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Delhi AIIMS | 98 సెంటీమీటర్ల ఎత్తు.. 22 కిలోల బరువు.. 90 నిమిషాల్లో గర్భాశయం తొలగింపు
- ●Ranabaali Review | రణబాలి రివ్యూ ... విమర్శలకు బదులిచ్చేందుకు విజయ్ చేసిన సినిమానా?
- ●Lulu Mall | లూలూ మాల్.. కిట్ క్యాట్ చాక్లెట్లో పురుగులు ప్రత్యక్షం..!
- ●Bathukamma | 17న బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డ్స్ ప్రదానం
- ●NDA | ఎన్డీఏతో డీఎంకే దోస్తీ?
- ●FSSAI | నూనె ప్రకటనలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కొరడా.. బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్‌కు నోటీసులు!

Delhi AIIMS | 98 సెంటీమీటర్ల ఎత్తు.. 22 కిలోల బరువు.. 90 నిమిషాల్లో గర్భాశయం తొలగింపు

Ranabaali Review | రణబాలి రివ్యూ ... విమర్శలకు బదులిచ్చేందుకు విజయ్ చేసిన సినిమానా?

Lulu Mall | లూలూ మాల్.. కిట్ క్యాట్ చాక్లెట్లో పురుగులు ప్రత్యక్షం..!

Bathukamma | 17న బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డ్స్ ప్రదానం






