త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thakkellapally Ravinder Rao | మ‌హిళా ఎమ్మెల్యేల‌ను కించ‌ప‌రిచిన ఈ కాంగ్రెస్ స‌ర్కార్ కుప్ప‌కూల‌డం ఖాయం: ఎమ్మెల్సీ ర‌వీంద‌ర్ రావు

Thakkellapally Ravinder Rao | సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆధ్వర్యంలో శాసనసభను కాకుండా.. దుశ్శాసన సభను నడిపిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు (Thakkellapally Ravinder Rao) అన్నారు.

G

Telangana | Published On Sep 8, 2026, 7.24 am IST

Thakkellapally Ravinder Rao | మ‌హిళా ఎమ్మెల్యేల‌ను కించ‌ప‌రిచిన ఈ కాంగ్రెస్ స‌ర్కార్ కుప్ప‌కూల‌డం ఖాయం: ఎమ్మెల్సీ ర‌వీంద‌ర్ రావు
Advertisement

Thakkellapally Ravinder Rao | త్రినేత్ర‌.న్యూస్‌: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆధ్వర్యంలో శాసనసభను కాకుండా.. దుశ్శాసన సభను నడిపిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు (Thakkellapally Ravinder Rao) అన్నారు. రాజ్యాంగం, మహిళా హక్కుల గురించి ఢిల్లీ వేదికగా మొసలికన్నీరు కార్చే రాహుల్ గాంధీ , ప్రియాంకా గాంధీల (Priyanka Gandhi) ద్వంద్వ నీతి.. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరుతో అసెంబ్లీ సాక్షిగా బహిర్గతమైందని చెప్పారు.

ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ మహిళా మాజీమంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిపై పోలీసులతో దాడి చేయించార‌ని విమ‌ర్శించారు. ఒకరి గొంతునొక్కి, మరొకరి చీర పట్టి లాగించిన తీరు అత్యంత దౌర్భాగ్యమైనది. ఇది కేవలం ఆ ఇద్దరికే జరిగిన అవమానం కాద‌ని, యావత్ తెలంగాణలోని 1.7 కోట్ల మంది మహిళలందరినీ జరిగిన అవమానమేని చెప్పారు. నాడు మహాభారతంలో ద్రౌపదికి జరిగిన అవమానానికి ఆమె శాపం తగిలి, కౌరవ వంశం ఎలాగైతే సర్వనాశనమైందో, ఇప్పుడు ఇద్దరు మహిళా ప్రజాప్రతినిధులను కించపరిచిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయమన్నారు.

రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంకా గాంధీలకు నిజంగానే రాజ్యాంగంపై, మహిళా సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే.. తెలంగాణలో జరుగుతున్న ఈ దారుణాలపై తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన అహంకారాన్ని, మొండివైఖరిని పక్కనబెట్టి.. బాధితులైన మహిళా శాసనసభ్యులకు, అలాగే యావత్ తెలంగాణ (Telangana) మహిళా లోకానికి తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రేవంత్ రెడ్డి సర్కార్ కక్షసాధింపు రాజకీయాలపై, మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై బీఆర్ఎస్ పక్షాన ప్రజాక్షేత్రంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Advertisement
Advertisement