త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అనేలా పోలీసుల తీరు: హ‌రీశ్ రావు

Harish Rao | పోలీసుల తీరు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లు ఉంద‌ని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత‌ హరీశ్ రావు అన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌ను సభలోకి రానివ్వకుండా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు క్రూరంగా , కర్కశంగా సభ్యుల మీద దాడి చేసి సభా హక్కులను కబళించార‌న్నారు.

G

Telangana | Published On Sep 8, 2026, 9.24 am IST

Harish Rao | ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అనేలా పోలీసుల తీరు: హ‌రీశ్ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: పోలీసుల తీరు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లు ఉంద‌ని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత‌ హరీశ్ రావు అన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌ను సభలోకి రానివ్వకుండా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు క్రూరంగా , కర్కశంగా సభ్యుల మీద దాడి చేసి సభా హక్కులను కబళించార‌న్నారు. ఎమ్మెల్సీలు తాతా మ‌ధు, న‌వీన్ రెడ్డి అరెస్టు చేయ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని చెప్పారు. హైకోర్టు చెప్పినా లెక్కచేయకుండా కేసులు పెట్టి అరెస్ట్ చేయడం అంటే చట్టాన్ని, న్యాయస్థానాలను ధిక్కరించడమే.

`ప్రతిపక్షం అంటే ఎందుకింత కక్ష రేవంత్ రెడ్డి?. బీఆర్ఎస్‌ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి రాకుండా చేసి, ప్రజా సమస్యలు సభలో చర్చకు రాకుండా చేయడమే మీ కుట్రా?. 1000 రోజుల పాలన వైఫల్యాలు, 22A భూముల వ్యవహారం, భూ కుంభకోణాలు, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు, రైతుల సమస్యలు సభలో చర్చకు వస్తాయనే భయంతోనే ఈ అరెస్టులా?.

మా మహిళా శాసన సభ్యుల చీరలు లాగారు.. గొంతు పిసికారు.. ఈ వికృత చేష్టలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా, ఉల్టా మాపైనే కేసులు పెడతారా? అరెస్టులు చేస్తారా?. బీఆర్ఎస్‌ శాసన సభ్యుల ఇండ్ల ముందు ఎందుకు ఇంత మంది పోలీసులను పెట్టారు? ఎందుకు మా ఇళ్ళను చుట్టు ముట్టారు?. ఖాకీలను ప్రైవేట్ సైన్యంగా వాడుకుంటూ హిట్లర్ పాలనను తలపిస్తున్నావు. ఇది ప్రజాపాలన కాదు.. ప్రతిపక్ష గొంతు నొక్కే ఎమర్జెన్సీ రాజ్యం!

ప్రశ్నిస్తే కేసు.. నిలదీస్తే అరెస్ట్.. ప్రజల సమస్యలపై మాట్లాడితే నిర్బంధం!. రేవంత్ రెడ్డి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బీఆర్ఎస్‌ గొంతుకను అణచలేరు. ప్రజా సమస్యలపై మా పోరాటం ఆగదు. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని కడుగుతాం.` అని స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement