త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | ఎర్రవెల్లిలో కేసీఆర్ నివాసం చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు

KCR | ఎర్ర‌వెల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ నివాసం చుట్టూ పోలీసులు భారీగా మోహ‌రించారు. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజాము నుంచే అక్క‌డ పోలీసులు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

S

Telangana | Published On Sep 8, 2026, 8.52 am IST

KCR | ఎర్రవెల్లిలో కేసీఆర్ నివాసం చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు
Advertisement

KCR | త్రినేత్ర‌.న్యూస్ : ఎర్ర‌వెల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ నివాసం చుట్టూ పోలీసులు భారీగా మోహ‌రించారు. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజాము నుంచే అక్క‌డ పోలీసులు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు కూడా భారీగా చేరుకుంటున్నారు. కేసీఆర్ ఇంటి వ‌ద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్పెష‌ల్ ఫోర్స్ పోలీసుల‌ను కూడా రంగంలోకి దించారు.

ఎందుకీ పోలీసు బ‌ల‌గాలు అంటే..?

స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మ‌ధు చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌ను నిర‌సిస్తూ.. కేసీఆర్ ఫామ్‌హౌజ్‌ను 1000 డ‌ప్పుల‌తో ముట్టడిస్తామ‌ని టీ పీసీసీ సీనియ‌ర్ నేత దేవ‌ని స‌తీష్ మాదిగ‌ హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే. దళిత, దండోర, మాల మహానాడు సంఘాలు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ నేత‌లందరూ త‌ర‌లి రావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ క్ర‌మంలో కేసీఆర్ ఇంటి వ‌ద్ద పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement