త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RTC Strike | ఆర్టీసీ స‌మ్మెకు కౌంట్‌డౌన్‌.. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి నుంచే బ‌స్సులు బంద్‌!

RTC Strike | ఆర్టీసీ స‌మ్మెకు (RTC Strike) కౌంట్‌డౌన్ ప్రారంభ‌మైంది. మ‌రో 48 గంట‌ల్లో స‌మ్మె షురూ కానుంది. యూనియ‌న్ల పున‌రుద్ధ‌ర‌ణ‌, ప్ర‌భుత్వంలో ఆర్టీసీ విలీనం (TGS RTC), సంస్థ ప‌రిర‌క్ష‌ణ స‌హా పెండింగ్‌లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలంటూ ఆర్టీసీ ఉద్యోగులు ఈ నెల 13న‌ స‌మ్మెకు పిలుపునిచ్చారు.

G

Telangana | Published On Apr 20, 2026, 11.08 am IST

RTC Strike | ఆర్టీసీ స‌మ్మెకు కౌంట్‌డౌన్‌.. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి నుంచే బ‌స్సులు బంద్‌!
Advertisement

RTC Strike | త్రినేత్ర‌.న్యూస్‌: ఆర్టీసీ స‌మ్మెకు (RTC Strike) కౌంట్‌డౌన్ ప్రారంభ‌మైంది. మ‌రో 48 గంట‌ల్లో స‌మ్మె షురూ కానుంది. యూనియ‌న్ల పున‌రుద్ధ‌ర‌ణ‌, ప్ర‌భుత్వంలో ఆర్టీసీ విలీనం (TGS RTC), సంస్థ ప‌రిర‌క్ష‌ణ స‌హా పెండింగ్‌లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలంటూ ఆర్టీసీ ఉద్యోగులు ఈ నెల 13న‌ స‌మ్మెకు పిలుపునిచ్చారు. ఈ నెల 22 నుంచి నిర‌వ‌ధిక స‌మ్మెకు దిగుతామ‌ని ప్ర‌క‌టించారు. స‌మ్మెకు మ‌రో రెండు రోజులే గ‌డువు ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం నుంచి ఉలుకూప‌లుకూ లేదు. ఆర్టీసీ విలీనం, యూనియన్ల పునరుద్ధరణ మినహా అన్ని డిమాండ్లకు సానుకూలంగా ఉన్న ప్రభుత్వం.. ఉద్యోగుల‌తో చ‌ర్చ‌ల ఊసే ఎత్త‌డం లేదు.

అయితే స‌మ్మె అంశాన్ని స‌ర్కార్‌ తేలిక‌గా తీసుకుంద‌నే విమ‌ర్శ‌లు వెళ్లువెత్తుతున్నాయి. కావాల‌నే చ‌ర్చ‌ల‌ను తాత్సారం చేస్తున్న‌దా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రో రెండు రోజులే గ‌డువు ఉన్న‌ప్ప‌టికీ త‌మ‌ను చ‌ర్చ‌ల‌కు పిల‌వ‌క పోవ‌డం ప‌ట్ల ప్ర‌భుత్వంపై ఆర్టీసీ జేఏసీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న‌ది. గతంలోనూ సమ్మెకు ఒక్క రోజు ముందు ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గామని, ఈ సారి సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని జేఏసీ నేతలు వెల్ల‌డించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్ల‌నున్న నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం (ఏప్రిల్ 21న‌) అర్ధరాత్రి నుంచే బస్సులు నిలిచిపోనున్నాయి.

కార్మికులు డిమాండ్లు ఇవే..

  • ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేసి, ప్ర‌భుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
  • ట్రేడ్ యూనియ‌న్ల‌పై ఆంక్ష‌లు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నిక‌లు నిర్వ‌హించాలి
  • ఉచిత బ‌స్సు ప‌థ‌కం కింద నెల‌కు రూ.400 కోట్ల బ‌కాయిలు త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాలి.
  • బెడ్ విన్న‌ర్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్ పోస్టుల‌ను త‌క్ష‌ణ‌మే ప‌ర్మినెంట్ చేయాలి
  • అద్దె బ‌స్సు డ్రైవ‌ర్ల‌ను సంస్థ‌లో విలీనం చేయాలి
  • సంస్థ ప్రైవేటీక‌ర‌ణ‌ను ఆపివేయాలి
  • ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలి
Advertisement
Advertisement