Jeevan Reddy | ప్రజలు ఆశించిన పాలన రాలే.. రేవంత్ కంటే కేసీఆర్ పాలన బాగుంది: మాజీ మంత్రి జీవన్ రెడ్డి
Jeevan Reddy | రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలన బాగుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి (Jeevan Reddy) అన్నారు. ప్రజలు ఆశించిన పాలన రాలేదని విమర్శించారు.
Jeevan Reddy | త్రినేత్ర.న్యూస్: రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలన బాగుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి (Jeevan Reddy) అన్నారు. ప్రజలు ఆశించిన పాలన రాలేదని విమర్శించారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోతున్నదని మండిపడ్డారు. తాను త్వరలోనే బీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నానని ప్రకటించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన నివాసంలో కలువనున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులు, నిరుద్యోగులను రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పాలన చూసిన తర్వాత కేసీఆర్ పాలనే బాగుందని ప్రజలు భావిస్తున్నారని వెల్లడించారు. నష్టపోయిన ప్రతి రైతును గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుందని చెప్పారు.
జాతీయ స్థాయిలో బీజేపీ అయితే ఉత్తమమని, రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ మెరుగైన నాయకుడని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ వల్లే సాధ్యమైందని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా కాంగ్రెస రాష్ట్ర నాయకత్వంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. తరచూ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే





