త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల రెక్కల కష్టం.. వారి త్యాగాలు అమూల్యమైనవి: కేసీఆర్‌

KCR | అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (May Day) సందర్భంగా దేశాన్ని ముందుకు న‌డిపే కార్మిక, కర్షక లోకానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) శుభాకాంక్షలు తెలిపారు. ఉత్పత్తి రంగంలో భాగమై దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల రెక్కల కష్టం, వారి త్యాగాలు అమూల్యమైనవని కొనియాడారు.

G

Telangana | Published On May 1, 2026, 9.52 am IST

KCR | దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల రెక్కల కష్టం.. వారి త్యాగాలు అమూల్యమైనవి: కేసీఆర్‌
Advertisement

KCR | త్రినేత్ర‌.న్యూస్‌: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (May Day) సందర్భంగా దేశాన్ని ముందుకు న‌డిపే కార్మిక, కర్షక లోకానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) శుభాకాంక్షలు తెలిపారు. ఉత్పత్తి రంగంలో భాగమై దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల రెక్కల కష్టం, వారి త్యాగాలు అమూల్యమైనవని కొనియాడారు. చరిత్రాత్మక మే డే స్ఫూర్తితో గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. సబ్బండ కులాల కర్షక కార్మికుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, ఆదర్శవంతమైన పారిశ్రామిక విధానాలను అమలు చేసిందని చెప్పారు.

సింగరేణి, ఆర్టీసీ, భవన నిర్మాణ రంగం సహా పలు రంగాలకు చెందిన కార్మికులు, ఆటో డ్రైవర్లు, దినసరి కూలీలు, అసంఘటిత రంగ కార్మికుల కోసం త‌మ‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్తుచేశారు. తాము అనుస‌రించిన‌ వినూత్న పారిశ్రామిక విధానాల ద్వారా రాష్ట్రంలో సంపద సృష్టించడంతో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయని చెప్పారు. నాటి పదేండ్ల‌ ప్రగతి కార్యాచరణను మరింత పటిష్ఠంగా అమలుచేయడమే రాష్ట్ర కార్మిక లోకానికి మనమిచ్చే గొప్ప కానుక అని వెల్ల‌డించారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement