Jurala Project | జూరాలకు నీటి విడుదల.. కర్ణాటక ప్రభుత్వం అంగీకారం
Jurala Project | కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని జూరాల ప్రాజెక్టుకు నీటి విడుదలకు కర్ణాటక ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అంతర్ రాష్ట్ర జలాల సమస్యల పరిష్కారం కోసం కర్ణాటకలో తెలంగాణ మంత్రుల బృందం పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
Jurala Project | త్రినేత్ర న్యూస్ : కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని జూరాల ప్రాజెక్టుకు నీటి విడుదలకు కర్ణాటక ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అంతర్ రాష్ట్ర జలాల సమస్యల పరిష్కారం కోసం కర్ణాటకలో తెలంగాణ మంత్రుల బృందం పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో తెలంగాణ మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు సమావేశమయ్యారు.
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఆల్మట్టి నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాలని ఇప్పటికే మంత్రులు వినతి పత్రం సమర్పించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నీటి ఎద్దడి, పంటల ప్రస్తుత పరిస్థితులు వంటి అంశాలను డీకే శివకుమార్‌కు మంత్రులు వివరించారు. మానవతా దృక్పథంతో పాలమూరు ప్రజలకు సాగు, తాగునీటిని విడుదల చేయాలని కోరారు. మంత్రులు విజ్ఞప్తికి డీకే శివకుమార్ అంగీకారం తెలిపారు. విడుతల వారిగా 3 టీంఎసీల నీటి విడుదలపై సానుకూలంగా స్పందించారు. నీటి విడుదలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం డీకే శివకుమార్ ఆదేశించారు.
ఇక రైతుల ఆందోళనతో తెలంగాణ ప్రభుత్వం దిగివచ్చిన సంగతి తెలిసిందే. మంత్రి శ్రీహరి ఆదేశాలతో జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు అధికారులు నీటిని విడుదల చేశారు. ఆయకట్టు రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కుడి కాల్వ నుంచి 350 క్యూసెక్కులు, ఎడమ కాలువ నుంచి 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఆయకట్టు పంటలు కాపాడాలని సీఎం డీకే శివకుమార్‌ను తెలంగాణ మంత్రులు కోరారు. 4 ప్రాజెక్టుల కింద 5.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆయకట్టు పరిధిలోని పంటలు కీలక దశలో ఉన్నాయని, నీటి కొరత వస్తే పంట దిగుబడులపై ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. రైతుల ఆదాయం, జీవనోపాధిపై ప్రభావం పడుతుందని వెల్లడించారు. నెల రోజులు 5 వేల క్యూసెక్కుల కృష్ణా జలాలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నీటిని విడుదల చేస్తే కీలక దశలో ఉన్న పంటలను కాపాడవచ్చన్నారు. పొరుగు రాష్ట్రాల సహకార స్ఫూర్తితో నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Adobe Premiere | ఆండ్రాయిడ్ ఫోన్లకు అడోబ్ ప్రీమియర్.. ఇక ఫోన్లోనే 4కె వీడియో ఎడిటింగ్..
- ●Mercedes Benz Cars | భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బెంజ్ కార్లు
- ●Hero Motors | మూడు ఐపీఓల లిస్టింగ్.. ఎవరి షేర్ ఎంత లాభం ఇచ్చిందంటే?
- ●Bank Employees Strike | ఈ నెల 28 నుంచి మూడు రోజులు బ్యాంకులు బంద్.. ఉద్యోగుల సమ్మె సైరన్ ఎందుకు? వాళ్ల డిమాండ్స్ ఏంటి?
- ●Lady Shri Ram College | మైనర్‌పై గ్యాంగ్‌రేప్ ఘటన.. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న లేడీ శ్రీరామ్ కళాశాల
- ●Anthropic | ఆంథ్రోపిక్ నుంచి క్లాడ్ ఓపస్ 5.5.. గత మోడల్స్ కన్నా 40 శాతం తక్కువ ఖర్చు..

Adobe Premiere | ఆండ్రాయిడ్ ఫోన్లకు అడోబ్ ప్రీమియర్.. ఇక ఫోన్లోనే 4కె వీడియో ఎడిటింగ్..

Mercedes Benz Cars | భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బెంజ్ కార్లు

Hero Motors | మూడు ఐపీఓల లిస్టింగ్.. ఎవరి షేర్ ఎంత లాభం ఇచ్చిందంటే?

Bank Employees Strike | ఈ నెల 28 నుంచి మూడు రోజులు బ్యాంకులు బంద్.. ఉద్యోగుల సమ్మె సైరన్ ఎందుకు? వాళ్ల డిమాండ్స్ ఏంటి?






