Bandi Sanjay | సిరిసిల్ల నడిబొడ్డున కేటీఆర్, కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్
తమకు భయపడి కేటీఆర్ సిరిసిల్లలోనే అడ్డా పెట్టి ఓటుకు రూ.10 వేలు పంచుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కేటీఆర్.. నా జోలికొస్తే నీ బతుకును రోడ్డుకీడుస్తా అని బెదిరించారు.
Bandi Sanjay | మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలన్నీ బిజీ అయ్యాయి. బుధవారం కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
కాంగ్రెస్ రాజకీయ వ్యభిచారి అని, గాంధీభవన్‌లోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలు సంసారం చేస్తున్నారన్నారు. జిల్లా కాంగ్రెస్ ఆఫీసుల్లో మీటింగులు పెడుతూ వాళ్లే బీఫామ్‌లు పంచుతున్నారన్నారు. స్పీకర్‌కి ఇవన్నీ కనిపించడం లేదా? స్పీకర్ పదవికి మచ్చ తేవడం న్యాయమేనా? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. ఓట్ల కోసం వచ్చే ఫిరాయింపు ఎమ్మెల్యేలను నిలదీయాలని సిరిసిల్ల ప్రజలకు సూచించారు. వాళ్లు ఏ పార్టీలో ఉన్నారు.. ఎందుకు ఓటేయాలని ప్రశ్నించాలన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో సిరిసిల్లకు నయాపైసా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ వద్ద నయాపైసా లేదు.. వాళ్లకు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. వాళ్ల దగ్గర రూపాయి లేకనే ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోతున్నారన్నారు. మళ్లీ ఓట్ల కోసం మోసపూరిత హామీలతో వస్తున్నారన్నారు. కాంగ్రెస్ దొంగ హామీలను నమ్మి మోసపోతే 5 ఏళ్ల అరిగోస తప్పదని స్పష్టం చేశారు.
తమకు భయపడి కేటీఆర్ సిరిసిల్లలోనే అడ్డా పెట్టి ఓటుకు రూ.10 వేలు పంచుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కేటీఆర్.. నా జోలికొస్తే నీ బతుకును రోడ్డుకీడుస్తా అని బెదిరించారు. కేంద్రం నిధులిస్తే ఆ నిధులను మింగి సిరిసిల్లను వరదల్లో ముంచుతున్నారన్నారు.
https://x.com/bandisanjay_bjp/status/2019024261709766870
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



