Rekha Naik | సీఎంఆర్ కుంభకోణం.. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అరెస్టుకు రంగం సిద్ధం
Rekha Naik | కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి.. ఎఫ్‌సీఐకి బియ్యం (CMR Scam) అప్పగించాల్సిన మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) అందించడంలో మాయాజాలం చేస్తున్నారు.
Rekha Naik | త్రినేత్ర న్యూస్: కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి.. ఎఫ్‌సీఐకి బియ్యం (CMR Scam) అప్పగించాల్సిన మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) అందించడంలో మాయాజాలం చేస్తున్నారు. ధాన్యం, బియ్యం పక్కదారి పట్టించి రూ.కోట్లు స్వాహా చేస్తున్నారు. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ (Khanapur) మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌పై (Rekha Naik) సీఎంఆర్ కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సత్తెనపల్లిలో ఆమె పేరుతో ఉన్న ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్ (ARS Industries) మిల్లులో సుమారు రూ.40.96 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. తనిఖీలు, రికార్డుల పరిశీలన అనంతరం ఇంత భారీ మొత్తంలో ధాన్యం లెక్కల్లో లోటు ఉన్నట్లుగా తేలింది. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌పై గత ఆగస్టులో కేసు నమోదు చేశారు.
తాజాగా ఆమె అరెస్టుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. విజిలెన్స్, పోలీసు బలగాలు రేఖానాయక్ ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అదేవిధంగా ఖానాపూర్‌లో భారీగా పోలీసులు మోహరించారు. దీంతో విషయం తెలసుకున్న ఆమె అనుచరులు భారీ సంఖ్యలో రేఖానాయక్ ఇంటి వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావారణం నెలకొన్నది. ఈనేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Krithi Shetty | కీర్తి సురేష్, కృతిశెట్టి మాస్ స్టెప్పులు - హీరోయిన్ల పాటతో ప్రమోషన్స్ షురూ
- ●BMS | రవాణా కార్మికుల సమస్యలపై కేంద్రం సానుకూలం
- ●Rajagopal Reddy | ఇకనైనా అహంకారాన్ని వీడు.. నీలో ఎంతో మార్పు వచ్చేదుండే
- ●Anthropic Shares | నిరాశపరిచిన ఆంథ్రోపిక్.. లిస్టింగ్ రెండో రోజే భారీ పతనం..
- ●Supreme Court | ఆ విషయం తేల్చకుండా.. ఇళ్ల కొనుగోలుదారులపై బలవంతపు రికవరీలు వద్దు
- ●HMWSSB | హైదరాబాద్ నీటి కష్టాలకు చెక్!

Krithi Shetty | కీర్తి సురేష్, కృతిశెట్టి మాస్ స్టెప్పులు - హీరోయిన్ల పాటతో ప్రమోషన్స్ షురూ

BMS | రవాణా కార్మికుల సమస్యలపై కేంద్రం సానుకూలం

Rajagopal Reddy | ఇకనైనా అహంకారాన్ని వీడు.. నీలో ఎంతో మార్పు వచ్చేదుండే

Anthropic Shares | నిరాశపరిచిన ఆంథ్రోపిక్.. లిస్టింగ్ రెండో రోజే భారీ పతనం..






