త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | డివైడ‌ర్‌ను ఢీకొట్టి అంటుకున్న కారు.. డ్రైవ‌ర్ బ‌య‌టికొచ్చేలోపే ఏం జ‌రిగిందంటే!

Road Accident | నిర్మల్ (Nirmal) జిల్లా సోపీనగర్‌లో శ‌నివారం వేగంగా దూసుకొచ్చిన ఓ కారు (Car) డివైడర్‌ను బ‌లంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి.

S

Telangana | Published On Nov 14, 2026, 7.05 pm IST

Road Accident | డివైడ‌ర్‌ను ఢీకొట్టి అంటుకున్న కారు.. డ్రైవ‌ర్ బ‌య‌టికొచ్చేలోపే ఏం జ‌రిగిందంటే!
Advertisement

Road Accident | త్రినేత్ర న్యూస్‌: నిర్మల్ (Nirmal) జిల్లా సోపీనగర్‌లో శ‌నివారం వేగంగా దూసుకొచ్చిన ఓ కారు (Car Accident) డివైడర్‌ను బ‌లంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. స్థానికంగా ఉన్న ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌నల‌కు గురయ్యారు. కారులో ఉన్న వ్య‌క్తి బ‌య‌టికొచ్చేలోపే స‌జీవ ద‌హ‌న‌మ‌య్యాడు. ఈ ఘ‌ట‌న‌తో స్థానికంగా విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. ఈ ప్ర‌మాద దృశ్యాలు ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌గా మారాయి.

ప్ర‌మాద స‌మ‌యంలో కారులో భారీగా మంటలు వ్యాపించాయ‌ని.. ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి ఉండ‌డంతో కారులో ఉన్న‌ వ్యక్తిని రక్షించలేకపోయామని స్థానికులు వాపోయారు. ఈ ఘ‌ట‌న‌పై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించ‌గా వారు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారని చెప్పారు.

స‌మాచారం తెలుసుకున్న వెంట‌నే పోలీసులు హుటాహుటిన ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని ప‌రిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపారు. కాగా మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement