త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nalamasa Srikanth Goud | దసరా వేళ కవిత కీలక ప్రకటన.. టీఆర్ఎస్ తొలి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నలమాస శ్రీకాంత్ గౌడ్

దసరా వేళ కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రక్షణ సేన తరపున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే తొలి ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేశారు. పూర్తి వివరాలివే.

J

Telangana | Published On Oct 20, 2026, 4.31 pm IST

Nalamasa Srikanth Goud | దసరా వేళ కవిత కీలక ప్రకటన.. టీఆర్ఎస్ తొలి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నలమాస శ్రీకాంత్ గౌడ్

సంక్షిప్త సారాంశం

వరంగల్ - ఖమ్మం - నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి తెలంగాణ రక్షణ సేన అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను ప్రకటించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత. పార్టీ ఆవిర్భావం తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే మొట్టమొదటి అభ్యర్థిగా దసరా శుభ ముహూర్తాన శ్రీకాంత్ గౌడ్ పేరు ఖరారు. ఎమ్మెల్సీ ఎన్నికల కో-ఆర్డినేషన్ కోసం స్టేట్ పార్టీ అబ్జర్వర్‌గా సీనియర్ నేత సయ్యద్ ఇస్మాయిల్ నియామకం. కాకతీయ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేసి, తెలంగాణ ఉద్యమంలోనూ, జాగృతిలోనూ కవిత వెన్నంటి నడిచిన బహుజన నేతకు తొలి అవకాశం.

Advertisement

Nalamasa Srikanth Goud | త్రినేత్ర న్యూస్ : దసరా పండుగ శుభ ముహూర్తాన తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత కీలక రాజకీయ ప్రకటన చేశారు. వరంగల్ - ఖమ్మం - నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ (Graduate MLC) స్థానం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను బరిలోకి దించుతున్నట్లు హైదరాబాద్‌లో అధికారికంగా ప్రకటించారు.

తెలంగాణ రక్షణ సేన పార్టీ స్థాపించిన తర్వాత ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతుండటం ఇదే మొదటిసారి. పార్టీ తరపున శాసన మండలి (MLC) ఎన్నికల్లో పోటీ చేసే తొలి అభ్యర్థిగా శ్రీకాంత్ గౌడ్ పేరును కవిత ఖరారు చేశారు. దీంతో పాటు వరంగల్ - ఖమ్మం - నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కో-ఆర్డినేషన్ కోసం సీనియర్ నాయకుడు సయ్యద్ ఇస్మాయిల్‌ను స్టేట్ పార్టీ అబ్జర్వర్‌గా (State Party Observer) నియమించారు.

ఎవరీ డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్?

ఉమ్మడి వరంగల్ జిల్లా (ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా) నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ గౌడ్.. కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University) నుంచి పీహెచ్‌డీ (PhD) పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన అత్యంత క్రియాశీలకంగా పాల్గొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Kalvakuntla Kavitha Announces First MLC Candidate For Telangana Rakshana Sena

జాగృతి నుంచి కవిత వెన్నంటి నడిచిన బహుజన గొంతుక

తెలంగాణ జాగృతి ఏర్పడినప్పటి నుంచి శ్రీకాంత్ గౌడ్ కల్వకుంట్ల కవిత వెన్నంటి నడిచారు. పార్టీ అధికార ప్రతినిధిగా (Spokesperson) టీవీ ఛానెల్స్ డిబేట్లలోనూ, వివిధ ప్రజా సంఘాల సమావేశాల్లోనూ పార్టీ బలమైన గొంతుకగా నిలిచారు.

గత మూడేళ్లుగా బహుజనుల గొంతుకగా అనేక ఉద్యమాలకు రూపకల్పన చేసిన కల్వకుంట్ల కవిత.. ఇప్పుడు తన పార్టీ తరపున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికలోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ విద్యావంతుడైన బహుజన నేతకు పట్టం కట్టారు.

Advertisement
Advertisement