Kavitha | ఒక వైపు ధరలు పెరుగుతుంటే.. ఎన్హెచ్ఎం ఉద్యోగుల జీతాలు తగ్గిస్తారా?.. రేవంత్ సర్కార్పై కవిత ఆగ్రహం
Kavitha | నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఉద్యోగుల జీతాలు తగ్గించడంపై తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల ఉద్యోగులుంటే వారిలో కొంతమంది వేతనాలను ప్రభుత్వం రూ. 4 వేల నుంచి రూ.5 వేలు తగ్గించిందని విమర్శించారు.
Kavitha | త్రినేత్ర న్యూస్: నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఉద్యోగుల జీతాలు తగ్గించడంపై తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల ఉద్యోగులుంటే వారిలో కొంతమంది వేతనాలను ప్రభుత్వం రూ. 4 వేల నుంచి రూ.5 వేలు తగ్గించిందని విమర్శించారు. ఒక వైపు ధరలు పెరుగుతూ, కరువు పరిస్థితులు ఉంటే.. ఉద్యోగుల జీతాలు తగ్గిస్తారా? అని మండిపడ్డారు. ఉద్యోగుల వేతనాల కోసం కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సమయానికి ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎన్హెచ్ఎం ఉద్యోగుల శ్రమను దోచుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఉద్యోగుల జీతాల తగ్గింపుపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
కొందరు ఉద్యోగుల జీతాలు తగ్గించి మరికొందరి వేతనాలు మాత్రం పెంచారని.. ఉద్యోగుల పట్ల ఇంత వివక్ష ఎందుకని ప్రశ్నించారు. ఎన్హెచ్ఎం ఉద్యోగుల విషయంలో ఏం జరిగిందో రివ్యూ చేసి ఉద్యోగుల జీతాలు పెంచాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి ఆదేశాలివ్వాలన్నారు. ఉద్యోగులకు ఏటా 5 శాతం జీతాలు పెంచాలని కేంద్ర నిబంధనల్లో ఉన్నప్పటికీ జీతాలు తగ్గించడం ఏమిటని మండిపడ్డారు.
ఎన్నిక సందర్భంగా ఎన్హెచ్ఎం ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని (Regularisation) హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి న్యాయం చేయడం లేదని చెప్పారు. దేశంలోని ఏడు రాష్ట్రాల్లో ఎన్ హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారని.. అందులో కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ కూడా ఉందన్నారు. ఏపీలో 30 శాతం జీతాలు పెంచడంతో పాటు రెగ్యులరైజ్ చేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తు చేశారు. గ్రామీణ ఆరోగ్య వ్యవస్థకు ఎంతో కీలకమైన ఎన్హెచ్ఎంలను రాష్ట్రంలో కూడా రెగ్యులరైజ్ చేయాలని, వెంటనే ఉద్యోగులందరి జీతం పెంచాలని డిమాండ్ చేశారు. ద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేనట్లయితే వారి తరఫున ప్రజా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ఎం) ఉద్యోగుల జీతాలు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో 1195 తేవడం అన్యాయం
రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల ఉద్యోగులుంటే వారిలో కొంతమంది వేతనాలు రూ. 4 వేల నుంచి రూ.5 వేలు తగ్గించారు. ఒక వైపు ధరలు పెరుగుతూ, కరువు పరిస్థితులు ఉంటే.. ద్రవ్యోల్బణం నానాటికి పెరుగుతూ ఉంటే ఉద్యోగుల జీతాలు తగ్గిస్తారా?
ఉద్యోగుల వేతనాల కోసం కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సమయానికి ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం లేదు. ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల శ్రమను దోచుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 18, 2026
తాజావార్తలు
- ●France Protests | భగ్గుమన్న ఫ్రాన్స్.. 143 ఏండ్ల చారిత్రక భవనానికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు
- ●Lorry Tyre | రన్నింగ్లో ఉండగా ఊడిన లారీ టైరు.. హైవేపై పరుగులు.. వాహనదారులకు తప్పిన ప్రమాదం.. వీడియో
- ●TTD | రేపు తిరుమల శ్రీనివాసుడి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
- ●Rain Update | నేడు, రేపు ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు
- ●Bedi Anjaneya Swamy | ఆంజనేయుడికి బేడీలు ఎందుకు?
- ●Sheetla Mata Temple | భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 13 మంది దుర్మరణం

France Protests | భగ్గుమన్న ఫ్రాన్స్.. 143 ఏండ్ల చారిత్రక భవనానికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు

Lorry Tyre | రన్నింగ్లో ఉండగా ఊడిన లారీ టైరు.. హైవేపై పరుగులు.. వాహనదారులకు తప్పిన ప్రమాదం.. వీడియో

TTD | రేపు తిరుమల శ్రీనివాసుడి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Rain Update | నేడు, రేపు ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు






