త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold Mine Collapse | కూలిన‌ బంగారు గ‌ని.. 14 మంది మృతి

Gold Mine Collapse | నైరుతి కొలంబియాలోని (Colombia) న‌రినో ప్రావిన్స్‌లో అక్ర‌మ బంగారు గ‌ని కూలి (Gold Mine Collapse) 14 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు ఏడుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

D

International | Published On Oct 20, 2026, 3.41 pm IST

Gold Mine Collapse | కూలిన‌ బంగారు గ‌ని.. 14 మంది మృతి
Advertisement

Gold Mine Collapse | త్రినేత్ర న్యూస్ : కొలంబియా (Colombia)లో ప్ర‌మాదం చోటు చేసుకుంది. అక్ర‌మ బంగారు గ‌ని కూలి (Gold Mine Collapse) 14 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు ఏడుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. నైరుతి కొలంబియాలోని న‌రినో ప్రావిన్స్‌లో గ‌ల శాంటా బార్బ‌రా డి ఇస్కువాండే మున్సిపాలిటి ప‌రిధిలోని గ్రామీణ చాంబెరో (Chambero) ప్రాంతంలో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు అధికారులు తెలిపారు.

ప్రమాదం జరిగిన ప్రాంతానికి స‌హాయ‌క బృందాలు చోరుకోవ‌డం క‌ష్టంగా మారింది. అక్క‌డి భౌగోళిక ప‌రిస్థితులు క్లిష్టంగా ఉండ‌టంతోపాటూ ఆ ప్రాంతంలో ప్ర‌భుత్వ తిరుగుబాటు గ్రూపులు క్రియాశీలకంగా ఉండ‌టం వ‌ల్ల భద్రతా పరమైన సవాళ్లు ఎదుర‌య్యాయి. అయితే, మాన‌వ‌తా దృక్ప‌థంతో స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు స‌హ‌క‌రించాల‌ని కొలంబియా అంబుడ్స్‌మ‌న్ కార్యాల‌యం సాయుధ ముఠాల‌ను కోరింది. అయితే, ప్ర‌స్తుతం అక్క‌డ స‌హాయ‌క చ‌ర్య‌లు ముగిసిన‌ట్లు నరినో గవర్నర్ లూయిస్ అల్ఫోన్సో ఎస్కోబార్ ప్ర‌క‌టించారు. ఇలాంటి ప్రమాదకరమైన అక్రమ, చిన్న తరహా మైనింగ్ కార్య‌క‌లాపాల‌ను క్రమబద్ధీకరించి, కార్మికులకు కనీస రక్షణ సౌకర్యాలు కల్పించేలా చర్యలు వేగవంతం చేయాలని ఆయన జాతీయ మైనింగ్ ఏజెన్సీని, గ‌నులు, ఇంధ‌న మంత్రిత్వ శాఖ‌ను కోరారు.

Also Read..

Sadu Mata | అక్క‌డ మ‌గ‌వాళ్లు చీర‌లు క‌ట్టుకుని గర్భా ఎందుకు ఆడ‌తారు..? దీని వెనుకున్న అస‌లు క‌థ ఇదే..!

మాక్రాన్ వ‌ల్లే ఈ ప‌రిస్థితి.. పారిస్ ఒక ముస్లిం న‌గ‌రంగా మార‌బోతోంది : ట్రంప్

ర‌జ‌నీకాంత్ జైల‌ర్ 2 కోసం.. థియేట‌ర్ మొత్తాన్ని బుక్ చేసిన స్టార్ క్రికెటర్..!

Advertisement
Advertisement