Telangana | తెలంగాణ కథతో మంచు మనోజ్ మైథాలజీ మూవీ – డైరెక్టర్‌గా పూరి జగన్నాథ్ శిష్యుడు
తెలంగాణ నేపథ్య కథలతో రూపొందుతోన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద చక్కటి విజయాలను అందుకుంటున్నారు.తాజాగా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో మంచు మనోజ్ ఓ సినిమా చేయబోతున్నాడు. దసరా సందర్భంగా ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ శిష్యుడు ఏ శ్రీధర్ దర్శకత్వం వహించబోతున్నారు.
Entertainment | Published On Oct 20, 2026, 2.33 pm IST
Telangana | ప్రస్తుతం టాలీవుడ్‌లో తెలంగాణ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. తెలంగాణ కథలతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన క్రేజీ కళ్యాణం, ప్యారడైజ్ సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. తాజాగా ఈ బ్యాక్‌డ్రాప్‌లో మరో సినిమా రాబోతుంది. దసరాను పురస్కరించుకొని ఈ సినిమా హీరోతో పాటు డైరెక్టర్, బ్యానర్‌ను రివీల్ చేశారు.
మంచు మనోజ్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాతో ఏ శ్రీధర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రేమకథా చిత్రమ్, జక్కన్న వంటి సినిమాలను నిర్మించిన అక్షిత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి ఆర్‌పీఏ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
పోతురాజుల కథతో...
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పోతరాజు నేపథ్యంలో డివైన్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. పూరి జగన్నాథ్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన ఏ. శ్రీధర్ డిఫరెంట్ పాయింట్‌తో ఈ కథను సిద్ధం చేశారు. ఈ సినిమాతోనే శ్రీధర్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మునుపెన్నడూ చూడని లుక్, క్యారెక్టరైజేషన్‌తో మంచు మనోజ్ పాత్ర సరికొత్తగా ఉంటుందని మేకర్స్ తెలిపారు.
తెలంగాణ పండుగలు...
పోతరాజు నేపథ్యంలో భక్తి, యాక్షన్ సన్నివేశాల కలబోతగా ఈ సినిమా ఉంటుంది. తెలంగాణ పండుగల వైభవం, సంప్రదాయాల రియలిస్టిక్‌గా ఈ సినిమాలో చూపించబోతున్నామని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా టైటిల్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, షూటింగ్ వివరాలను త్వరలో వెల్లడిస్తామని అన్నారు.
సెకండ్ ఇన్నింగ్స్....
మిరాయ్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మంచు మనోజ్ ప్రస్తుతం హీరోగా వడ్డీకాసులవాడ, డేవిడ్ రోడ్డితో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ ఫిక్స్ – దసరా రోజు చిన్న సినిమాలకు షాకిచ్చిన వెంకటేష్
అక్టోబర్ 20, 2026

Sanju Samson | రజనీకాంత్ జైలర్ 2 కోసం.. థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన స్టార్ క్రికెటర్..!
అక్టోబర్ 20, 2026

Sai Pallavi | బాలీవుడ్ సినిమా అనగానే భయపడ్డా – రామాయణపై సాయిపల్లవి కామెంట్స్
అక్టోబర్ 20, 2026
తాజావార్తలు
- ●Donald Trump | మాక్రాన్ వల్లే ఈ పరిస్థితి.. పారిస్ ఒక ముస్లిం నగరంగా మారబోతోంది : ట్రంప్
- ●Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ ఫిక్స్ - దసరా రోజు చిన్న సినిమాలకు షాకిచ్చిన వెంకటేష్
- ●Sanju Samson | రజనీకాంత్ జైలర్ 2 కోసం.. థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన స్టార్ క్రికెటర్..!
- ●Yusuf Pathan | పార్టీ మారగానే.. యూసఫ్ పఠాన్‌కు బీజేపీ ప్రభుత్వం భారీ గిఫ్ట్
- ●UNGA | ఉగ్రవాదుల చేతుల్లోకి సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానం.. ఐరాస వేదికగా భారత్ తీవ్ర ఆందోళన
- ●Jio Platforms IPO | జియో ఐపీఓకు భారీ స్పందన.. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.8,110 కోట్లు..

Donald Trump | మాక్రాన్ వల్లే ఈ పరిస్థితి.. పారిస్ ఒక ముస్లిం నగరంగా మారబోతోంది : ట్రంప్

Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ ఫిక్స్ - దసరా రోజు చిన్న సినిమాలకు షాకిచ్చిన వెంకటేష్

Sanju Samson | రజనీకాంత్ జైలర్ 2 కోసం.. థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన స్టార్ క్రికెటర్..!

Yusuf Pathan | పార్టీ మారగానే.. యూసఫ్ పఠాన్‌కు బీజేపీ ప్రభుత్వం భారీ గిఫ్ట్



