త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Abhijit Dipke | దీపావ‌ళి వ‌ర‌కూ ఎలాంటి నిర‌స‌న‌లు లేవు.. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయండి.. మ‌ద్ద‌తుదారుల‌కు దిప్కే పిలుపు

Abhijit Dipke | దీపావ‌ళి (Diwali) పండుగ వ‌ర‌కూ త‌మ పార్టీ ఎలాంటి నిర‌స‌న (CJP Protests) కార్య‌క్ర‌మాలను నిర్వ‌హించ‌బోద‌ని కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (Cockroach Janata Party) వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దిప్కే (Abhijit Dipke) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పండుగ‌ల వేళ కుటుంబంతో త‌మ విలువైన స‌మ‌యాన్ని గ‌డ‌పాల‌ని త‌న మ‌ద్ద‌తుదారుల‌కు సూచించారు.

D

National | Published On Oct 20, 2026, 4.09 pm IST

Abhijit Dipke | దీపావ‌ళి వ‌ర‌కూ ఎలాంటి నిర‌స‌న‌లు లేవు.. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయండి.. మ‌ద్ద‌తుదారుల‌కు దిప్కే పిలుపు
Advertisement

Abhijit Dipke | త్రినేత్ర న్యూస్ : ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (Cockroach Janata Party) వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దిప్కే (Abhijit Dipke) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. దీపావ‌ళి (Diwali) పండుగ వ‌ర‌కూ త‌మ పార్టీ ఎలాంటి నిర‌స‌న కార్య‌క్ర‌మాలను నిర్వ‌హించ‌బోద‌ని (no protests till Diwali) స్ప‌ష్టం చేశారు. అదేవిధంగా పండుగ‌ల వేళ కుటుంబంతో త‌మ విలువైన స‌మ‌యాన్ని గ‌డ‌పాల‌ని త‌న మ‌ద్ద‌తుదారుల‌కు సూచించారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా వీడియో సందేశం పంపారు.

"నా మ‌ద్ద‌తుదారులంద‌రినీ నేను కోరేది ఒక్క‌టే. కొద్ది రోజులు మీరు మీ కుటుంబ స‌భ్యుల‌తో గ‌డ‌పండి. పండుగ‌లు వ‌స్తున్నాయి. గ‌డిచిన కొన్ని రోజులుగా మీరు ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కొన్నారు. ఎంతో మంది అరెస్ట‌య్యారు. ఆ ప‌రిణామాల‌తో మీ ఫ్యామిలీ ఆందోళ‌న చెంది ఉంటుంది. అందుకే కొన్ని రోజులు మీ ప్రియ‌మైన వారితో టైమ్ స్పెండ్ చేయండి. వారి ఆందోళ‌న‌ను అర్థం చేసుకోండి" అని దిప్కే త‌న మ‌ద్ద‌తుదారుల‌కు పిలుపునిచ్చారు.

ఆందోళ‌న సంద‌ర్భంగా సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఎదుర్కొన్న ప‌రిస్థితుల‌ను దిప్కే ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఒక్క రోజు కూడా జైల్లో ఉండ‌లేన‌ని భావించిన సౌర‌వ్ దాస్‌.. ఐదు రోజుల జైలు జీవితం గ‌డిపిన త‌ర్వాత కూడా చిరున‌వ్వుతో కోర్టుకు వ‌చ్చాడ‌ని గుర్తు చేశారు. జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ పొడిగించిన‌ట్లు తెలిసిన‌ప్ప‌టికీ.. సౌర‌వ్ ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కుండా ధైర్యంతో ఉన్నార‌ని చెప్పుకొచ్చారు. అటు అశుతోష్ రంకాలో కూడా ఎలాంటి భ‌యం లేద‌ని ఎంతో ధైర్యంగా ఉన్నార‌ని చెప్పుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)పై అభిజీత్ దిప్కే తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను జైల్లో ఉంచ‌డానికి ప్ర‌ధాని మోదీ మొత్తం ప్ర‌భుత్వ యంత్రాగాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌ని ఆరోపించారు.

Also Read..

Sadu Mata | అక్క‌డ మ‌గ‌వాళ్లు చీర‌లు క‌ట్టుకుని గర్భా ఎందుకు ఆడ‌తారు..? దీని వెనుకున్న అస‌లు క‌థ ఇదే..!

మాక్రాన్ వ‌ల్లే ఈ ప‌రిస్థితి.. పారిస్ ఒక ముస్లిం న‌గ‌రంగా మార‌బోతోంది : ట్రంప్

ర‌జ‌నీకాంత్ జైల‌ర్ 2 కోసం.. థియేట‌ర్ మొత్తాన్ని బుక్ చేసిన స్టార్ క్రికెటర్..!

Advertisement
Advertisement