త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malayalam OTT | ఓటీటీలోకి మ‌ల‌యాళం టైమ్ ట్రావెల్ థ్రిల్ల‌ర్ మూవీ – ఫ‌స్ట్ నైట్ రోజే భార్య కిడ్నాప్ అయితే!

టైమ్ ట్రావెల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన మ‌ల‌యాళం మూవీ ధూమ‌కేతు విభిన్న‌మైన ప్ర‌య‌త్నంగా ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. స‌జీన్ గోపు, నిఖిలా విమ‌ల్ హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది. అక్టోబ‌ర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మ‌ల‌యాళం, తెలుగు భాష‌ల్లో స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Entertainment | Published On Oct 20, 2026, 4.06 pm IST

Malayalam OTT | ఓటీటీలోకి మ‌ల‌యాళం టైమ్ ట్రావెల్ థ్రిల్ల‌ర్ మూవీ – ఫ‌స్ట్ నైట్ రోజే భార్య కిడ్నాప్ అయితే!
Advertisement

Malayalam OTT |  రోమాంచం ఫేమ్ స‌జీన్ గోపు, నిఖిలా విమ‌ల్ హీరోహీరోయిన్లుగా న‌టించిన మ‌ల‌యాళం టైమ్ ట్రావెల్ థ్రిల్ల‌ర్ మూవీ ధూమ‌కేతు. సుధీ మాడిస‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, సిద్ధార్థ్ భ‌ర‌త‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ప్ర‌యోగాత్మ‌క కాన్సెప్ట్‌తో రూపొందిన చిన్న సినిమా విభిన్న‌మైన ప్ర‌య‌త్నంగా మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది.

నెట్‌ఫ్లిక్స్‌లో...

ధూమ‌కేతు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖ‌రారైంది. అక్టోబ‌ర్ 23న నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌ల అవుతోంది. మ‌ల‌యాళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్‌కు ఈ మూవీ అందుబాటులోకి రానుంది.

యావ‌రేజ్‌గా...

కాన్సెప్ట్ , కామెడీ బాగున్నా రిపీటెడ్ సీన్లు, సైన్స్ ఫిక్ష‌న్ పాయింట్‌ను అర్థ‌వంతంగా ఆడియెన్స్‌కు చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డ‌టంతో బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా మిగిలింది.

టైమ్ లూప్ కార‌ణంగా...

కుట్ట‌న్ 36 ఏళ్లు వ‌చ్చినా పెళ్లి కాదు. చాలా సంబంధాలు చెడిపోతాయి. బ్యాచ్‌ల‌ర్‌గానే మిగిలిపోదామ‌ని ఫిక్స‌య్యే టైమ్‌లో శ‌ర్మిల‌తో అత‌డికి పెళ్లి జ‌రుగుతుంది. స‌రిగ్గా కుట్ట‌న్‌, శ‌ర్మిల పెళ్లి రోజునే ఆకాశంలో మూడువేల ఏళ్ల‌కు ఒక‌సారి క‌నిపించే ధూమ‌కేతు అనే తోక‌చుక్క ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. శోభ‌నం రోజే కొంద‌రు ముసుగు మ‌నుషులు కుట్ట‌న్‌ను చంపేసి శ‌ర్మిల‌ను కిడ్నాప్ చేస్తాడు. కానీ ఆ త‌ర్వాత రోజు కుట్ట‌న్ బ‌తుకుతాడు. శ‌ర్మిల కూడా అత‌డి కళ్ల‌ముందే ఉంటుంది. తానో టైమ్ లూప్‌లో చిక్కుకున్నాన‌ని కుట్ట‌న్ క‌నిపెడ‌తాడు. దాని నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? ముసుగుమ‌నుషుల బారి నుంచి భార్య‌ను ఎలా కాపాడుకున్నాడ‌న్న‌దే ఈ మూవీ క‌థ‌.

తెలుగులో...

ధూమ‌కేతులో హీరోయిన్‌గా న‌టించిన నిఖిలా విమ‌ల్ తెలుగులో మేడ‌మీద అబ్బాయి, గాయ‌త్రి, దొంగ‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేసింది.

 

 

 

Advertisement
Advertisement