Sadu Mata | అక్కడ మగవాళ్లు చీరలు కట్టుకుని గర్భా ఎందుకు ఆడతారు..? దీని వెనుకున్న అసలు కథ ఇదే..!
Sadu Mata | అహ్మదాబాద్‌లో నవరాత్రి సందర్భంగా ఓ భిన్న సంప్రదాయం ఉంది. అక్కడ పురుషులు స్త్రీ వేషధారణలో గర్భా నృత్యం చేయడం సంప్రదాయం. ఈ సంప్రదాయం వెనుక 200 ఏళ్ల నాటి చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. సాధు మాత (Sadu Mata) చేసిన త్యాగానికి ప్రతీకగా పురుషులు చీరలు ధరించి గర్భా నృత్యం చేసే అరుదైన ఆచారం కొనసాగుతోంది.
Sadu Mata | త్రినేత్ర న్యూస్ : నవరాత్రులు అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది దాండియా, గర్భా (Garba) నృత్యాలే. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ అంతా ఒకచోట చేరి రాత్రిపూట నృత్యాలు చేస్తూ సందడిగా గడుపుతుంటారు. ఈ నృత్యాలకు గుజరాత్ (Gujarat) రాష్ట్రం ఫేమస్. గుజరాత్‌కు చెందిన సంప్రదాయ గర్భా నృత్యం ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందింది. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఆరాధనలో భాగంగా ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు.
అమ్మాయిలు రంగు రంగు దుస్తులు ధరించి గర్భా నృత్యం చేస్తూ సందడి చేస్తుంటారు. అయితే, అహ్మదాబాద్ (Ahmedabad)లో నవరాత్రి సందర్భంగా ఓ భిన్న సంప్రదాయం ఉంది. అక్కడ పురుషులు స్త్రీ వేషధారణలో గర్భా నృత్యం చేయడం సంప్రదాయం. నవరాత్రి అష్టమి (Navratri Ashtami) వేళ బారోట్ కమ్యూనిటీకి (Barot community) చెందిన పురుషులు చీరలు, ఆభరణాలు ధరించి బొట్టుపెట్టుకుని డ్యాన్స్ చేస్తారు. చిన్న పిల్లల నుంచి అంతా ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు. సాధు మాత (Sadu Mata)కు అంకితమైన శతాబ్దాల నాటి పురాతన ఆచారంలో భాగంగా గర్భా నృత్యం చేస్తారు.
ఆచారం వెనుక అసలు కథ
ఈ సంప్రదాయం వెనుక 200 ఏళ్ల నాటి చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. సాధు మాత (సాదు బా) చేసిన త్యాగానికి ప్రతీకగా పురుషులు చీరలు ధరించి గర్భా నృత్యం చేసే అరుదైన ఆచారం కొనసాగుతోంది. అప్పట్లో బారోట్ వంశానికి చెందిన సాధూ బెన్ (సాధు మాత) అనే అందమైన స్త్రీ ఉండేది. ఆమె అందాన్ని చూసి మోహించిన అప్పటి పాలకులు ఆమెను బంధించాల్సిందిగా సైనికులను ఆదేశించారు. అయితే, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెను రాజసభకు పంపడానికి బారోట్ కమ్యూనిటీ సభ్యులు నిరాకరించడంతో సైనికులతో ఘర్షణ చెలరేగింది. అది కాస్తా తీవ్రరూపం దాల్చడంతో సాధు మాత ముందుగా తన కూతురు అజుబాను హతమార్చింది. ఆ తర్వాత ఆత్మబలిదానం చేసుకుంది.
వెంటాడిన సాధు మాత శాపం..
ఆమె మరణం ఆ కమ్యూనిటీలో తీవ్రమైన అపరాధ భావానికి దారితీసింది. ఆ తర్వాత కాలంలో వంశాలు క్షీణించడం, పురుషులు అకాల మరణాలు పెరిగిపోయాయి. ఆ పరిస్థితి చూసి కమ్యూనిటీ పెద్దలు ఆందోళనకు గురయ్యారు. సాధుమాత శాపమే వెంటాడుతోందని భావించిన అక్కడి ప్రజలు.. క్షమాభిక్ష కోరుతూ ఆమె జ్ఞాపకార్థం నిర్మించిన ఆలయం వద్ద సమావేశమయ్యారు. తమ కుటుంబాల మనుగడ కోసం ప్రార్థించారు. సాధు బా ధరించే దుస్తులను పురుషులు ధరించి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ప్రతిజ్ఞ చేశారు. ఆ పూజల తర్వాత తమ కుటుంబ వంశాలు మళ్లీ అభివృద్ధి చెందడంతో.. ఆ ఆచారంపై వారికి విశ్వాసం పెరిగింది.
క్షమాభిక్ష కోరుతూ..
అప్పటి నుంచి ఇప్పటి వరకూ అక్కడి ప్రజలు ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తుండటం విశేషం. సుమారు 40 మంది బారోట్ కమ్మూనిటీ పురుషులు నవరాత్రుల ఎనిమిదో రోజైన అష్టమి రాత్రి వేళ చీరలు కట్టుకుని, ఆభరణాలు ధరించి సాధు మాత ఆలయం వద్ద అత్యంత భక్తి శ్రద్ధలతో గర్భా నృత్యం చేయడం సంప్రదాయంగా మారింది. ఈ పూజా కార్యక్రమంలో చిన్న పిల్లల నుంచి ప్రతీ ఒక్కరూ స్త్రీ వేషధారణలో పాల్గొని తమ భక్తిని చాటుకుంటున్నారు. సాధు మాతను స్మరించుకుంటూ.. క్షమాభిక్ష కోరుతూ కుటుంబాలు, సమాజం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నారు.
Also Read..
మాక్రాన్ వల్లే ఈ పరిస్థితి.. పారిస్ ఒక ముస్లిం నగరంగా మారబోతోంది : ట్రంప్
రజనీకాంత్ జైలర్ 2 కోసం.. థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన స్టార్ క్రికెటర్..!
పార్టీ మారగానే.. యూసఫ్ పఠాన్‌కు బీజేపీ ప్రభుత్వం భారీ గిఫ్ట్
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Telangana | తెలంగాణ కథతో మంచు మనోజ్ మైథాలజీ మూవీ - డైరెక్టర్‌గా పూరి జగన్నాథ్ శిష్యుడు
- ●Donald Trump | మాక్రాన్ వల్లే ఈ పరిస్థితి.. పారిస్ ఒక ముస్లిం నగరంగా మారబోతోంది : ట్రంప్
- ●Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ ఫిక్స్ - దసరా రోజు చిన్న సినిమాలకు షాకిచ్చిన వెంకటేష్
- ●Sanju Samson | రజనీకాంత్ జైలర్ 2 కోసం.. థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన స్టార్ క్రికెటర్..!
- ●Yusuf Pathan | పార్టీ మారగానే.. యూసఫ్ పఠాన్‌కు బీజేపీ ప్రభుత్వం భారీ గిఫ్ట్
- ●UNGA | ఉగ్రవాదుల చేతుల్లోకి సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానం.. ఐరాస వేదికగా భారత్ తీవ్ర ఆందోళన

Telangana | తెలంగాణ కథతో మంచు మనోజ్ మైథాలజీ మూవీ - డైరెక్టర్‌గా పూరి జగన్నాథ్ శిష్యుడు

Donald Trump | మాక్రాన్ వల్లే ఈ పరిస్థితి.. పారిస్ ఒక ముస్లిం నగరంగా మారబోతోంది : ట్రంప్

Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ ఫిక్స్ - దసరా రోజు చిన్న సినిమాలకు షాకిచ్చిన వెంకటేష్

Sanju Samson | రజనీకాంత్ జైలర్ 2 కోసం.. థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన స్టార్ క్రికెటర్..!





