Palla Rajeshwar Reddy | కడియం! జనగామకు ఏం చేశావ్.. జిల్లా గురించి మాట్లాడకిగ
Palla Rajeshwar Reddy | కడియం శ్రీహరి (Kadiyam Srihari) గతంలో జనగామ జిల్లా కోసం ఏం చేశారని.. ఇప్పుడు జిల్లా గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైరయ్యారు.
- కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఇక్కడ అభివృద్ధి చేశాం
- మీరిచ్చిన హామీలు అమలు కాకుంటే ప్రజలే బుద్ధి చెప్తరు
- జనగామ జిల్లా ఆవిర్భావ దశాబ్ది సభలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్
Palla Rajeshwar Reddy | త్రినేత్ర న్యూస్: కడియం శ్రీహరి (Kadiyam Srihari) గతంలో జనగామ జిల్లా కోసం ఏం చేశారని.. ఇప్పుడు జిల్లా గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైరయ్యారు. జిల్లా కోసం ప్రజలు పోరాడితే బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని చెప్పారు. దేవాదుల నుంచి లక్షల ఎకరాలకు తాము సాగునీరు అందించామని.. కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలే మిగిలాయని వ్యాఖ్యానించారు. హామీలు అమలు చేయకుంటే ప్రజలే కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఆదివారం జనగామలో నిర్వహించిన జిల్లా ఆవిర్భావ దశాబ్ది సభలో ఆయన ప్రసంగించారు. జిల్లా జోలికొస్తే ఖబడ్దార్ అంటే హెచ్చరించారు.
జనగామ జిల్లా కోసం పోరాడింది ప్రజలే. అభివృద్ధి చేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే. కేసీఆర్ హయాంలోనే కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, ఆసుపత్రులు తీసుకొచ్చాం. దేవాదుల ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం. రైతులకు సాగునీరు, విద్యుత్ అందించాలి. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి. కడియం శ్రీహరి అయినా.. ఇతర నాయకులైనా సర్పంచులు, కౌన్సిలర్లను బెదిరిస్తే చూస్తూ ఊరుకోబోం. మూడు నెలల్లో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తాం అని పల్లా తెలిపారు.
అంతకుముందు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో చంపక్ హిల్స్ సమీపంలో, ఎమ్మెల్యే పల్లా ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ వద్ద, మాజీ మంత్రి డాక్టర్ రాజయ్య ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమీపంలో పాలాభిషేక కార్యక్రమాలు చేపట్టారు.
తాజావార్తలు
- ●Chennai Metro Phase II | చెన్నైలో మోదీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం.. ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మధురై రింగ్ రోడ్డు
- ●KTR | రూ. 402 కోట్లతో కొత్త క్యాంపస్ నిర్మించాలి.. సిరిసిల్ల జేఎన్టీయూపై సీఎంకు కేటీఆర్ లేఖ
- ●Adluri Laxman | తెగిపడిన లిఫ్ట్.. మంత్రి అడ్లూరికి తప్పిన పెను ప్రమాదం
- ●Jaya Saradhi Reddy | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో సీనియర్ జర్నలిస్ట్..?
- ●Devi Navaratri | దేవీ నవరాత్రులు చేయలేకపోతున్నారా..? ఈ మూడు రోజులు చేస్తే చాలు..!
- ●Green India Challenge-Maharashtra | ఊరూరికో జమ్మి చెట్టు.. మహారాష్ట్రలోనూ శ్రీకారం

Chennai Metro Phase II | చెన్నైలో మోదీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం.. ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మధురై రింగ్ రోడ్డు

KTR | రూ. 402 కోట్లతో కొత్త క్యాంపస్ నిర్మించాలి.. సిరిసిల్ల జేఎన్టీయూపై సీఎంకు కేటీఆర్ లేఖ

Adluri Laxman | తెగిపడిన లిఫ్ట్.. మంత్రి అడ్లూరికి తప్పిన పెను ప్రమాదం

Jaya Saradhi Reddy | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో సీనియర్ జర్నలిస్ట్..?







