Jurala Project | ఆయకట్టు రైతులకు సాగునీటి కోసం.. జూరాల నుంచి నీరు విడుదల..
Jurala Project | రైతుల ఆందోళనలతో ప్రభుత్వం దిగివచ్చింది. ఆయకట్టు అవసరాల కోసం జూరాల (Jurala Project) నుంచి నీటిని విడుదల చేసింది. మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) ఆదేశాలో ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు అధికారులు విడుదల చేశారు.
Jurala Project | త్రినేత్ర.న్యూస్: రైతుల ఆందోళనలతో ప్రభుత్వం దిగివచ్చింది. ఆయకట్టు అవసరాల కోసం జూరాల (Jurala Project) నుంచి నీటిని విడుదల చేసింది. మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) ఆదేశాలో ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు అధికారులు విడుదల చేశారు. ఆయకట్టు రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కుడి కాల్వ నుంచి 350 క్యూసెక్కులు, ఎడమ కాలువ నుంచి 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
మరోవైపు సాగునీటి అవసరాల కోసం నారాయణపూర్ నుంచి జూరాలకు కృష్ణా జలాలను విడుదల చేయాలని కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ను (DK Shiva Kumar) మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. మంగళవారం బెంగళూరు వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేల బృందం.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతుల పరిస్థితిని కర్ణాటక (Karnataka) సీఎంకు వివరించారు. జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఆయకట్టు పంటలు కాపాడాలని కోరారు. 4 ప్రాజెక్టుల కింద 5.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆయకట్టు పరిధిలోని పంటలు కీలక దశలో ఉన్నాయని, నీటి కొరత వస్తే పంట దిగుబడులపై ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. రైతుల ఆదాయం, జీవనోపాధిపై ప్రభావం పడుతుందని వెల్లడించారు. నెల రోజులు 5 వేల క్యూసెక్కుల కృష్ణా జలాలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం నీటిని విడుదల చేస్తే కీలక దశలో ఉన్న పంటలను కాపాడవచ్చన్నారు. పొరుగు రాష్ట్రాల సహకార స్ఫూర్తితో నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మంత్రుల విజ్ఞప్తికి డీకే శివకుమార్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రైతులకు లాభం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బుధవారం మరోసారి సమావేశమవుదామని మంత్రుల బృందానికి సూచించారు.
తాజావార్తలు
- ●Soaps | సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్ట్‌లపై ఇక ఆకుపచ్చ, ఎరుపు రంగు చుక్కలు.. కొత్త నిబంధనలు..
- ●RIMS Adilabad | నవజాత శిశువుల వార్డులో పేలిన ఏసీ.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య
- ●Nursing Student | సెలవులకు ఇంటికి వచ్చి.. అనుమానాస్పద స్థితిలో నర్సింగ్ విద్యార్థిని మృతి
- ●Gold And Silver Prices Today | బంగారం ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు.. జాగ్రత్త అంటున్న నిపుణులు..
- ●Apple Mac Mini | యాపిల్ కొత్త మ్యాక్ మినీ, మ్యాక్ స్టూడియో వచ్చేశాయి.. ధరలు ఇవే..
- ●2019 Easter bombings | 2019 ఈస్టర్ ఆత్మాహుతి దాడుల కేసు.. 15 మందికి 200 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష

Soaps | సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్ట్‌లపై ఇక ఆకుపచ్చ, ఎరుపు రంగు చుక్కలు.. కొత్త నిబంధనలు..

RIMS Adilabad | నవజాత శిశువుల వార్డులో పేలిన ఏసీ.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య

Nursing Student | సెలవులకు ఇంటికి వచ్చి.. అనుమానాస్పద స్థితిలో నర్సింగ్ విద్యార్థిని మృతి

Gold And Silver Prices Today | బంగారం ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు.. జాగ్రత్త అంటున్న నిపుణులు..






