త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Komatireddy Venkat Reddy | ఆ ఆంధ్రా అధికారే మ‌మ్మ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టిచ్చిండు

Komatireddy Venkat Reddy | ఇరిగేష‌న్ శాఖ‌ (Irrigation Dept)లో ఆంధ్రా అధికారుల‌ (Andhra Pradesh Officials)ను పెట్టుకుంటే మ‌మ్మ‌ల్నే త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని.. దీంతోనే కృష్ణా జ‌లాల విష‌యంలో పొర‌పాటు జ‌రిగింద‌ని మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) వ్యాఖ్యానించారు.

S

Telangana | Published On Nov 26, 2026, 7.14 pm IST

Komatireddy Venkat Reddy | ఆ ఆంధ్రా అధికారే మ‌మ్మ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టిచ్చిండు
Advertisement
  • ఏడాది నుంచి తెలిసినా ఏపీ జలదోపిడీ విషయం మాకు చెప్పలే
  • లీవ్ పెట్టి కాదు.. రిజైన్ చేసి వెళ్ల‌కుంటే మంచిగుండ‌ద‌ని వార్నింగ్ ఇచ్చిన
  • మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

Komatireddy Venkat Reddy | త్రినేత్ర న్యూస్‌: ఇరిగేష‌న్ శాఖ‌(Irrigation Dept)లో ఆంధ్రా అధికారుల‌(Andhra Pradesh Officials)ను పెట్టుకుంటే మ‌మ్మ‌ల్నే త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని.. దీంతోనే కృష్ణా జ‌లాల విష‌యంలో పొర‌పాటు జ‌రిగింద‌ని మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) వ్యాఖ్యానించారు. ఏడాదిగా ఏపీ ప్ర‌భుత్వం (AP Govt) జ‌ల దోపిడీ కోసం అక్ర‌మ ప్రాజెక్టు క‌డుతున్నా నాగార్జున సాగ‌ర్ ఎస్ఈ మ‌ల్లికార్జున్ త‌మ‌కు చెప్ప‌లేద‌న్నారు. ఆయన్ను రిజైన్ చేసి వెళ్లిపోమ‌ని వార్నింగ్ ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ‌ల ఉంచుకోవ‌డ‌మే మా పొర‌పాటు

కృష్ణా జ‌లాల‌కు సంబంధించి ఒక చిన్న పొర‌పాటు జ‌రిగింది. నాగార్జునసాగర్ ఎస్ఈ మల్లికార్జున్ (SE Mallikharjun) నిర్లక్ష్యం వల్లే పల్నాడు వాటర్ గ్రిడ్ (Palnadu Water Grid) నిర్మాణం జరుగుతుంది. రూలింగ్ పార్టీపై ఎన్ని అబండాలు వేసినా మేం ప‌ట్టిచ్చుకోం. ఎస్ఈ మ‌ల్లికార్జున్ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్య‌క్తి. అత‌న్ని మేం తెలంగాణ ఉంచుకోవ‌డ‌మే మా పొర‌పాటు. సంవ‌త్సర‌కాలంగా తెలిసి కూడా అత‌ను మాకు చెప్ప‌లే. నేన్ ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన‌. నువ్ లీవ్ పెట్టి కాదు.. రిజైన్ చేసి వెళ్లిపో.. లేకుంటే మంచిగుండ‌ద‌ని చెప్పిన‌. ప్ర‌భుత్వంల ఉన్న‌వాళ్లు కుట్ర ప‌న్ని మోసం చేసిండ్రు. అయినా స‌రే ప్ర‌తిప‌క్షాల‌కు చెప్తున్నా.. కావాల‌ని ఎవ‌రూ పొర‌పాటు చేయ‌రు. కాంగ్రెస్‌కు పేరు వస్తుందనే కేసీఆర్ ఎస్ఎల్‌బీసీ (SLBC) పూర్తి చేయలేదు. 2028, జూన్ నాటికి SLBC పూర్తి చేస్తాం.

Advertisement
Advertisement