Jurala Project | జూరాల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద.. 10 గేట్లు ఎత్తివేత
Jurala Project | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ (Krishna River) పరుగులు పెడుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి జూరాల ప్రాజెక్టులోకి (Jurala Project) భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది.
Jurala Project | త్రినేత్ర.న్యూస్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ (Krishna River) పరుగులు పెడుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి జూరాల ప్రాజెక్టులోకి (Jurala Project) భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం 80 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నది. ఇది క్రమంగా లక్ష క్యూసెక్కులకు దాటవచ్చని అధికారులు భావిస్తున్నారే. ఈనేపథ్యంలో 10 గేట్లు ఎత్తి శ్రీశైలానికి (Srisailam) నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా జలవిద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 47 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ కాలువలకు సాగునీటిని విడుదల చేయడంతోపాటు ఎగువ , దిగువ జల విద్యుత్ కేంద్రాల్లోని 10 యూనిట్లలో 395 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నారు.
మరోవైపు ఉత్తర తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది (Godavari River) జలకలను సంతరించుకున్నది. మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 46 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 12.8864 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలుగా ఉంది. కుమ్రం భీమ్ జిల్లాలోని వట్టి వాగు ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుతున్నది. ప్రాజెక్టుకు 8 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 3 గేట్లు ఎత్తి 10,500 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
మరోవైపు కరీంనగర్ జిల్లాలో మిడ్ మానేరు జలాశయానికి ఎల్లంపల్లి నుంచి గాయత్రీ పంప్‌హౌస్ ద్వారా మూడు మోటార్ల సహాయంతో 12,400 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. లోయర్ మానేరు జలాశయానికి 1,230 క్యూసెక్కుల స్వల్ప ఇన్‌ఫ్లో వస్తున్నది. ఈ వర్షాకాలంలో లోయర్ మానేరు జలాశయానికి నమోదైన తొలి ఇన్‌ఫ్లో ఇదే కావడం విశేషం.
సంబంధిత వార్తలు

Srinivas Goud | జూరాల ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువలకు తక్షణమే నీటిని విడుదల చేయాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
జులై 29, 2026

Bogatha Waterfalls | ఉప్పొంగుతున్న బొగత జలపాతం.. పర్యాటకుల సందర్శన నిలిపివేత
జులై 29, 2026

Jurala Project | జూరాలకు పోటెత్తిన వరద.. దిగువకు 30 వేల క్యూసెక్కులు విడుదల
జులై 28, 2026
తాజావార్తలు
- ●Heavy Rains | ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
- ●Ramayana | విజువల్ వండర్ రామాయణ ట్రైలర్.. మీరూ చూసేయండి
- ●Horoscope | జూలై 30 రాశిఫలాలు.. ఈ రాశివారికి అనవసర ఖర్చులు ఉంటాయి!
- ●Asia's 50 Best Bars 2026 | ఆసియాలో 50 బెస్ట్ బార్స్ లిస్ట్.. టాప్-10లో గోవా ‘బాయిలర్‌మేకర్’..!
- ●RRR | ట్రిపుల్ ఆర్ పనులు వేగంగా సాగుతున్నయ్ : కేంద్ర మంత్రి గడ్కరీ
- ●RAAKA | బన్నీ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘రాకా’ను అట్లీ అలా ప్లాన్ చేస్తున్నాడా?

Heavy Rains | ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

Ramayana | విజువల్ వండర్ రామాయణ ట్రైలర్.. మీరూ చూసేయండి

Horoscope | జూలై 30 రాశిఫలాలు.. ఈ రాశివారికి అనవసర ఖర్చులు ఉంటాయి!

Asia's 50 Best Bars 2026 | ఆసియాలో 50 బెస్ట్ బార్స్ లిస్ట్.. టాప్-10లో గోవా ‘బాయిలర్‌మేకర్’..!



