త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Husband Murder | రూ. 18 ల‌క్ష‌ల ప‌రిహారం కోసం.. ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను చంపిన భార్య‌

Husband Murder | బ‌స్సులో ఏర్ప‌డిన ప‌రిచ‌యం వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది. అంతేకాదు.. పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల కింద వ‌చ్చిన ప‌రిహారం కోసం ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను మ‌ట్టుబెట్టింది భార్య‌. ఈ ఘ‌ట‌న మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని జ‌డ్చ‌ర్ల‌లో వెలుగు చూసింది.

S

Telangana | Published On Nov 25, 2026, 3.42 pm IST

Husband Murder | రూ. 18 ల‌క్ష‌ల ప‌రిహారం కోసం.. ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను చంపిన భార్య‌
Advertisement

Husband Murder | త్రినేత్ర న్యూస్ : బ‌స్సులో ఏర్ప‌డిన ప‌రిచ‌యం వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది. అంతేకాదు.. పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల కింద వ‌చ్చిన ప‌రిహారం కోసం ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను మ‌ట్టుబెట్టింది భార్య‌. ఈ ఘ‌ట‌న మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని జ‌డ్చ‌ర్ల‌లో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఉధండాపూర్‌కు చెందిన గజ్జి మల్లికార్జున్‌ (23) ప‌శువుల కాప‌రిగా జీవనం కొన‌సాగిస్తున్నాడు. రెండు నెల‌ల క్రితం త‌న భార్య అంజ‌మ్మ‌తో క‌లిసి మ‌ల్లికార్జున్ శ్రీశైలం ఆల‌యానికి వెళ్లాడు. ఇక బ‌స్సులో మ‌ల్లికార్జున్‌కు రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలానికి చెందిన శివ అనే వ్యక్తి ప‌రిచ‌యం అయ్యాడు. ఈ క్ర‌మంలో మ‌ల్లికార్జున్ నివాసానికి శివ రెండుమూడు సార్లు వ‌చ్చి వెళ్లాడు. దీంతో అంజ‌మ్మ‌తో శివ‌కు వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది.

అయితే ఈ మ‌ధ్య కాలంలోనే ఉధండాపూర్ ప్రాజెక్టు ముంపు ప‌రిహారంగా మ‌ల్లికార్జున్ కుటుంబానికి రూ. 18 ల‌క్ష‌లు వ‌చ్చాయి. ఈ సొమ్ముపై అంజ‌మ్మ‌, శివ క‌న్నేశారు. మ‌ల్లికార్జున్‌ను హ‌త్య చేసి డ‌బ్బులు చెరిస‌గం పంచుకోవాల‌ని వారిద్ద‌రూ ఒప్పందం చేసుకున్నారు. ఇక ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం.. కూలీ ప‌ని ఉందంటూ ఈ నెల 20న రాత్రి మ‌ల్లికార్జున్‌ను శివ పిలిపించాడు. అయితే రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నెమళ్లగుట్ట సమీపంలో కుళ్లిపోయిన మల్లికార్జున్ మృతదేహం లభ్యం కావడంతో, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆ డెడ్‌బాడీ మ‌ల్లికార్జున్‌దే అని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement