Jeevan Reddy | సజ్జనార్‌పై ఆరోపణలు.. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై కేసు
Jeevan Reddy | బీఆర్ఎస్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిపై (Jeevan Reddy) కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) విచారిస్తున్న సిట్ చీఫ్, హైదరాబాద్ సీపీ సజ్జనార్ను (Sajjanar) అసభ్య పదజాలంతో దూషిస్తూ, కుట్రపూరిత వ్యాఖ్యలు చేసి బెదిరించారంటూ పోలీస్ అధికారుల సంఘం ఆయనపై ఫిర్యాదు చేసింది.
Jeevan Reddy | త్రినేత్ర.న్యూస్: బీఆర్ఎస్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిపై (Jeevan Reddy) కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) విచారిస్తున్న సిట్ చీఫ్, హైదరాబాద్ సీపీ సజ్జనార్ను (Sajjanar) అసభ్య పదజాలంతో దూషిస్తూ, కుట్రపూరిత వ్యాఖ్యలు చేసి బెదిరించారంటూ పోలీస్ అధికారుల సంఘం ఆయనపై ఫిర్యాదు చేసింది. దీంతో జీవన్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు.
ఫోన్‌ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను (KCR) సిట్ బృందం గత ఆదివారం (ఫిబ్రవరి 1న) విచారించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ సజ్జనార్‌పై విరుచుకుపడ్డారు. ‘సీపీ సజ్జనార్ ఖబద్దార్.. నన్నే ఏమీ చేయలేకపోయావ్.. ఇంకా కేసీఆర్‌ను ఏం చేస్తావ్?. తెలంగాణ జాతిపిత కేసీఆర్‌ను విచారణల పేరుతో అవమానిస్తే చూస్తూ ఊరుకోం. డీజీపీ కావాలని సజ్జనార్ కలలు కంటున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వానికి తొత్తులా వ్యవహరిస్తున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేయాలని సజ్జనార్ ప్రయత్నం చేయలేదా?. పింక్‌బుక్‌లో సజ్జనార్ పేరు నంబర్ వన్‌లో ఉంటుంది. సజ్జనార్ రిటైర్ అయ్యి కర్ణాటక పోయినా, పుణె పోయినా.. ఎంపీ అయినా మేము వదిలిపెట్టం’ అని హెచ్చరించారు. దీంతో సీపీ సజ్జనార్ను అసభ్య పదజాలంతో దూషిస్తూ, కుట్రపూరిత వ్యాఖ్యలు చేసి బెదిరించారనే ఆరోపణలపై పోలీసులు జీవన్ రెడ్డిపై కేసు నమోదుచేశారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

BRS Constituency Incharges | 119 నియోజకవర్గాల ఇంచార్జీలు వీరే.. ప్రకటించిన గులాబీ అధినేత కేసీఆర్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



