Doctor Suspended | తనకు బదులు విధులకు మరో వ్యక్తి.. జోగిపేట ఏరియా హాస్పిటల్ డాక్టర్‌పై సస్పెన్షన్ వేటు
Doctor Suspended | సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా దవాఖానలో (Jogipet Area Hospital) తన స్థానంలో మరో వ్యక్తితో వైద్యసేవలు అందిస్తున్న వైద్యుడిపై ప్రభుత్వం చర్యలు (Doctor Suspended) తీసుకుంది.
Doctor Suspended | త్రినేత్ర.న్యూస్: సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా దవాఖానలో (Jogipet Area Hospital) తన స్థానంలో మరో వ్యక్తితో వైద్యసేవలు అందిస్తున్న వైద్యుడిపై ప్రభుత్వం చర్యలు (Doctor Suspended) తీసుకుంది. హాస్పిటల్‌లో డిప్యూటీ సివిల్ సర్జన్ (జనరల్ మెడిసిన్)గా పనిచేస్తున్న డాక్టర్ కే.రమేశ్.. డ్యూటీకి డుమ్మా కొట్టి తనకు బదులు ప్రైవేటు వ్యక్తిని పెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఆయనను సస్పెండ్ చేసింది. ఈ నెల 5న నైట్ డ్యూటీలో తనకు బదులు మరోవ్యక్తిని కూర్చోబెట్టడాన్ని తీవ్రంగా పరిగణించిన మంత్రి దామోదర రాజనర్సింహ.. తక్షణమే విచారణ జరపాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తును ఆదేశించారు.
దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపిన కమిటీ.. ఆరోపణలు నిజమేనని తేల్చడంతో డాక్టర్ కే.రమేశ్ సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రమేశ్‌కు బదులు ఆయన స్థానంలో కూర్చున్న వ్యక్తిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఆ వ్యక్తి వివరాలు సమర్పించాలని సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. హాస్పిటల్ సూపరింటెండెంట్‌పై కూడా శాఖపరమైన చర్యలు తీసుకున్నది.
తాజావార్తలు
- ●Dharmasthala Case | మరోసారి తెరపైకి ధర్మస్థల హత్యాచార కేసు.. సుప్రీం కీలక ఆదేశాలు
- ●Amazon Great Indian Festival | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్కు డేట్ ఫిక్స్.. భారీ ఆఫర్లు..
- ●Kerala Film Festival | కేరళ ఫిల్మ్ ఫెస్టివల్.. 31 సినిమాలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- ●KTR | సిరిసిల్ల అభివృద్ధిని కొడంగల్‌లో చేసేందుకు వస్తున్నరేమో?
- ●టెసరాక్ట్ వర్సెస్ ఫామ్‌హౌస్‌లు.. ఒకరి ఆరోపణకు మరొకరి ఆస్తులే సమాధానమా?
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లో జోరు.. 564 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..

Dharmasthala Case | మరోసారి తెరపైకి ధర్మస్థల హత్యాచార కేసు.. సుప్రీం కీలక ఆదేశాలు

Amazon Great Indian Festival | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్కు డేట్ ఫిక్స్.. భారీ ఆఫర్లు..

Kerala Film Festival | కేరళ ఫిల్మ్ ఫెస్టివల్.. 31 సినిమాలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం..

KTR | సిరిసిల్ల అభివృద్ధిని కొడంగల్‌లో చేసేందుకు వస్తున్నరేమో?






