త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Joginapally Santosh Kumar | జనం నమ్మకమే నీ గెలుపు.. టీవీకే అధినేత దళపతి విజయ్‌కు సంతోష్ కుమార్ అభినందనలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన టీవీకే (TVK) అధినేత, నటుడు విజయ్‌కు మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. దళపతి నాయకత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకానికి ఈ తీర్పు నిదర్శనమని కొనియాడిన ఆయన.. గతంలో విజయ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న క్షణాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

J

Telangana | Published On May 4, 2026, 8.22 pm IST

Joginapally Santosh Kumar | జనం నమ్మకమే నీ గెలుపు.. టీవీకే అధినేత దళపతి విజయ్‌కు సంతోష్ కుమార్ అభినందనలు
Advertisement

Joginapally Santosh Kumar | త్రినేత్ర.న్యూస్ : తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ తాజా ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని నమోదు చేసి సంచలనం సృష్టించింది. ఈ అద్భుత విజయం పట్ల రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి విజయ్‌కు ప్రశంసల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా రాజ్యసభ మాజీ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్ కుమార్.. దళపతి విజయ్‌కు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ సాధించిన అఖండ విజయం విజయ్ దార్శనికతకు, నాయకత్వ లక్షణాలకు దక్కిన గౌరవం అని సంతోష్ కుమార్ కొనియాడారు. ప్రజలు ఆయనపై ఉంచిన అపారమైన నమ్మకానికి, విశ్వాసానికి ఈ అద్భుతమైన తీర్పు ఒక స్పష్టమైన నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సంతోషకరమైన సమయంలో గతంలో పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో విజయ్ ఉత్సాహంగా పాల్గొన్న క్షణాలను ఆయన ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. కేవలం ప్రజాసేవతోనే కాకుండా పర్యావరణ బాధ్యత, మన దేశ ఉజ్వల, హరిత భవిష్యత్తు పట్ల విజయ్‌కు ఉన్న నిబద్ధతను ఆనాటి సంఘటన ప్రతిబింబిస్తుందని ఆయన ప్రశంసించారు.

Image

రాజకీయాల్లో ఒక సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న విజయ్‌కు సంతోష్ కుమార్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. విజయ్ చైతన్యవంతమైన, సమర్థవంతమైన నాయకత్వంలో తమిళనాడు రాష్ట్రం అభివృద్ధి, శ్రేయస్సు, సమ్మిళిత వృద్ధిలో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తాను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో, ప్రజలకు నిరంతరం సేవ చేయడంలో ఆయనకు మరింత శక్తి, విజయం లభించాలని తన సందేశంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement
Advertisement