త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Santosh Kumar | కీస‌ర రామ‌లింగేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్న మాజీ ఎంపీ సంతోష్ కుమార్

Santosh Kumar | కార్తీక మాసం నేప‌థ్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండ‌ర్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్.. కీస‌ర రామ‌లింగేశ్వ‌ర స్వామి వారిని సోమ‌వారం తెల్ల‌వారుజామున ద‌ర్శించుకున్నారు.

S

Hyderabad | Published On Nov 23, 2026, 9.21 am IST

Santosh Kumar | కీస‌ర రామ‌లింగేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్న మాజీ ఎంపీ సంతోష్ కుమార్
Advertisement

Santosh Kumar | త్రినేత్ర న్యూస్ : కార్తీక మాసం నేప‌థ్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండ‌ర్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్.. కీస‌ర రామ‌లింగేశ్వ‌ర స్వామి వారిని సోమ‌వారం తెల్ల‌వారుజామున ద‌ర్శించుకున్నారు. ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఇక గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మంలో భాగంగా మేడ్చ‌ల్ ఎమ్మెల్యే చామ‌కూర మ‌ల్లారెడ్డితో క‌లిసి కీస‌ర ఆల‌య ఆవ‌ర‌ణ‌లో ఉసిరి, బిల్వ మొక్క‌ల‌ను సంతోష్ కుమార్ నాటారు. గ‌త ఐదేళ్లుగా ప్ర‌తి ఇంట ఉసిరి.. ప్ర‌తి గుడిలో బిల్వం అనే కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది.

మన ఆధ్యాత్మిక సంప్రదాయాలలో భాగమైన ఈ కార్యక్రమం భక్తిని, పర్యావరణ బాధ్యతను ఏకం చేస్తుంది అని సంతోష్ కుమార్ పేర్కొన్నారు. బిల్వం, ఉసిరి.. ఈ పవిత్ర వృక్షాలను సంరక్షిద్దాం, మన ఘనమైన వారసత్వాన్ని కాపాడుకుందాం, భవిష్యత్ తరాలకు మరింత పచ్చని, ఆరోగ్యకరమైన భూమిని అందిద్దాం అని సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement