త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Green India Challenge | కార్తీక హరిత సంకల్పం.. హిల్స్ కాలనీలో ఉసిరి, బిల్వ మొక్కల పంపిణీ

Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge) ఆధ్వ‌ర్యంలో UTF-D హిల్స్ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో ఉసిరి (Amla), బిల్వ మొక్కల (Bael plant)ను మంగ‌ళ‌వారం పెద్ద ఎత్తున పంపిణీ చేశారు.

S

Flash news | Published On Nov 24, 2026, 3.38 pm IST

Green India Challenge | కార్తీక హరిత సంకల్పం.. హిల్స్ కాలనీలో ఉసిరి, బిల్వ మొక్కల పంపిణీ
Advertisement

Green India Challenge | త్రినేత్ర న్యూస్‌: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge) ఆధ్వ‌ర్యంలో UTF-D హిల్స్ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో ఉసిరి (Amla), బిల్వ మొక్కల (Bael plant)ను మంగ‌ళ‌వారం పెద్ద ఎత్తున పంపిణీ చేశారు. కార్తీక హరిత సంకల్పం కింద మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ నాయకత్వంలో ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. మహిళలు, యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలను స్వీకరించారు.

ఈ ప్రాంతంలో పచ్చదనాన్ని పెంచడం, సంప్రదాయ ఔషధ మొక్కలను ప్రోత్సహించే ఉద్దేశంతో వందలాది ఉసిరి, బిల్వ మొక్కలను అంద‌జేశారు. కార్తీక మాసంలో మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడం, సమాజ స్థాయిలో పర్యావరణ అవగాహనను పెంచడం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేస్తున్న నిరంతర ప్రయత్నాల్లో ఈ కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో UTF-D హిల్స్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్ రెడ్డి, కాలనీ ప్రతినిధులు శంకర్‌గౌడ్, పాపా వెంకట్‌రెడ్డి, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement