త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

JNTUH VC | మ‌హిళా అధ్యాప‌కుల ప‌ట్ల అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌.. జేఎన్‌టీయూ వీసీపై పోలీసుల‌కు ఫిర్యాదు

JNTUH VC | హైద‌రాబాద్ కూక‌ట్‌ప‌ల్లిలోని జేఎన్‌టీయూ వైస్‌చాన్స‌ల‌ర్ (JNTUH VC) టీ. కిర‌ణ్ కుమార్ రెడ్డిపై మహిళా అధ్యాప‌కులు (Women Faculty) పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలేజీలో నిర్వ‌హించనున్న స‌ద‌స్సుకు ఆహ్వానించ‌డానికి వెళ్లిన త‌మ‌పై దుర్భాష‌లాడుతూ (Verbal Abuse) దాడికి య‌త్నించారని ఆరోపించారు.

G

Telangana | Published On Oct 8, 2026, 12.27 pm IST

JNTUH VC | మ‌హిళా అధ్యాప‌కుల ప‌ట్ల అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌.. జేఎన్‌టీయూ వీసీపై పోలీసుల‌కు ఫిర్యాదు
Advertisement

JNTUH VC | త్రినేత్ర న్యూస్‌: హైద‌రాబాద్ కూక‌ట్‌ప‌ల్లిలోని జేఎన్‌టీయూ వైస్‌చాన్స‌ల‌ర్ (JNTUH VC) టీ. కిర‌ణ్ కుమార్ రెడ్డిపై మహిళా అధ్యాప‌కులు (Women Faculty) పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలేజీలో నిర్వ‌హించనున్న స‌ద‌స్సుకు ఆహ్వానించ‌డానికి వెళ్లిన త‌మ‌పై దుర్భాష‌లాడుతూ (Verbal Abuse) దాడికి య‌త్నించారని ఆరోపించారు. మీరు పిల్లల్ని కనడానికి మాత్రమే పనికొస్తారంటూ తమపై లింగద్వేష వ్యాఖ్యలతో అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అస‌లేం జ‌రిగిందంటే..

జేఎన్‌టీయూ అనుబంధ కళాశాల అయిన‌ విద్యాజ్యోతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (VJIT) కాలేజీలో ఈ నెల 30న ఏడబ్ల్యూస్‌ స్టూడెంట్‌ కమ్యూనికేషన్‌ సదస్సు నిర్వ‌హిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా ఆహ్వానించ‌డానికి కాలేజీ ప్రిన్సిపాల్ ఏ. సృజన, కళాశాల సీఎస్‌ఈ విభాగాధిపతి డీ అరుణకుమారి ఈ నెల 6న కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ వైస్‌ చాన్స్‌లర్ టీ. కిరణ్‌కుమార్‌రెడ్డి (Kiran Kumar Reddy) వ‌ద్ద‌కు వెళ్లారు. సదస్సుకు హాజ‌రుకావాలంటూ ఆహ్వాన పత్రిక అందచేశారు. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన వీసీ.. వారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను ఆహ్వానించే అర్హత మహిళలైన మీకు లేదని ఆగ్రహం వ్యక్తంచేసినట్టు బాధిత అధ్యాపకులు తెలిపారు. మహిళలు దేనికీ పనికిరారని, ఇంటికే పరిమితమై వంటగది చూసుకోవడం, పిల్లలను కనడం చేయాలంటూ అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. అక్కడ ఉన్న చెత్తబుట్టను చూపిస్తూ తమను అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ క్ర‌మంలో తాము అభ్యంతరం వ్యక్తం చేసేందుకు ప్రయత్నించగా గెట్‌ఔట్‌ అంటూ వీసీ గట్టిగా అరిచారని, అనంతరం టేబుల్‌పై ఉన్న సుత్తిని తీసుకుని తమపై దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అనురాగ్‌ యూనివర్సిటీ సీఈవో నీలిమను కూడా అసభ్యకర భాషలో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఎదుట కూర్చునే అర్హత కూడా లేదంటూ అవమానించారని త‌మ ఫిర్యాదులో తెలిపారు.

Advertisement
Advertisement