RS Praveen Kumar | ఎమ్మెల్యే శంకర్, రేవంత్‌రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయండి
RS Praveen Kumar | తెలంగాణ సాధకుడు, ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR) చనిపోవాలని క్రూరమైన భాష వాడిన షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు.
- బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఫిర్యాదు
RS Praveen Kumar | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ సాధకుడు, ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR) చనిపోవాలని క్రూరమైన భాష వాడిన షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. చావు భాషను ప్రేరేపిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy)పై కూడా కేసు నమోదు చేయాలన్నారు. ఈమేరకు మంగళవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పలువురు బీఆర్ఎస్ నాయకులు, మహిళా నాయకులతో కలిసి వెళ్లి ఫిర్యాదు చేశారు.
కేసీఆర్ ప్రాణాలకు హాని ఉంది
అనంతరం ఆర్ఎస్‌పీ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాధకుడు, ప్రతిపక్ష నేత కేసీఆర్ చనిపోవాలని, ఆయన చావు కోసం డప్పులు కొడతాం అని షాద్‌నగర్ ఎమ్మెల్యే ఓపెన్‌గా మాట్లాడడం అభ్యంతరకరం. ముఖ్యంగా ఈ చావు భాషను ఎంకరేజ్ చేస్తున్న సీఎం రేవంత్ మీద ఫిర్యాదు చేశాం. ఎస్కార్ట్‌తోటి కాంగ్రెస్ నాయకులను కేసీఆర్ నివాసం వైపు పోలీసులే తీసుకెళ్తున్నారు. కేసీఆర్ ప్రాణాలకు హాని ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి. బీఎన్ఎస్ సెక్షన్ 351, 351(3) , సెక్షన్ 196(1),సెక్షన్ 61 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.
కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్‌కు అండగా ఉండాలని, కాంగ్రెస్ దౌర్జన్యాలను నిరసిస్తూ ఈరోజు ఎర్రవల్లి వైపు పోతుంటే తిరుమలగిరి వద్ద అడ్డుకొని జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇంతకన్నా ఘోరమైన అన్యాయం ఉంటదా? చేయని నేరానికి మా ఎమ్మెల్సీలను తీస్కపోయి నారాయణ గూడ, సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. కనీసం వాళ్లు బ్రెష్ కూడా వేసుకోలేదు. మీడియా ముందు చావును ప్రేరేపించే భాష మాట్లాడడం చట్టప్రకారం నేరం అని ఆర్ఎస్ ప్రవీణ్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar | రాత్రిపూట బస్సులకు మంచి ఆదరణ ఉంది.. మరిన్ని రూట్లలో నడుపుతాం
సెప్టెంబర్ 8, 2026

KCR Erravalli Farmhouse Tension | కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత: ఎర్రవల్లిలో ‘వెయ్యి డప్పుల’ నిరసన.. సెక్షన్ 144 విధింపు
సెప్టెంబర్ 8, 2026

Revanth meets Gaddam Prasad | స్పీకర్‌కు రేవంత్, భట్టి ఓదార్పు
సెప్టెంబర్ 8, 2026
తాజావార్తలు
- ●Osmania University 85th Convocation | జాబ్ సీకర్స్ వద్దు.. ఎంట్రప్రెన్యూర్స్‌గా ఎదగండి
- ●Ponnam Prabhakar | రాత్రిపూట బస్సులకు మంచి ఆదరణ ఉంది.. మరిన్ని రూట్లలో నడుపుతాం
- ●TG Police Jobs | తెలంగాణ పోలీస్ ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు..!
- ●iPhone Ultra | యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ ధర రూ.2.50 లక్షలు..? భారీ అంచనాలు..
- ●Vaishnavi Chaitanya | ‘చెన్నై లవ్‌స్టోరీ’పై వైష్ణవి క్లారిటీ.. ఎందుకు రిజెక్ట్ చేసిందంటే..?
- ●Minister Vakiti Srihari CPR | అసెంబ్లీలో విషాదం: కుప్పకూలిన అధికారికి మంత్రి సీపీఆర్.. అయినా దక్కని ప్రాణం

Osmania University 85th Convocation | జాబ్ సీకర్స్ వద్దు.. ఎంట్రప్రెన్యూర్స్‌గా ఎదగండి

Ponnam Prabhakar | రాత్రిపూట బస్సులకు మంచి ఆదరణ ఉంది.. మరిన్ని రూట్లలో నడుపుతాం

TG Police Jobs | తెలంగాణ పోలీస్ ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు..!

iPhone Ultra | యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ ధర రూ.2.50 లక్షలు..? భారీ అంచనాలు..





