BRS Complaint to Governor | పొంగులేటి భూకబ్జాలపై గవర్నర్‌కు ఫిర్యాదు.. సాక్ష్యాధారాలను అందజేసిన బీఆర్ఎస్
BRS Complaint to Governor | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమ మైనింగ్, భూకబ్జాల పై విచారణ చేపట్టాలని భారత రాష్ట్ర సమితి శాసనసభ పక్షం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు (BRS MLAs, MLCs) రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు ఫిర్యాదు (Complaint) చేశారు. ఇండిపెండెంట్ జ్యుడీషియల్ ఎంక్వైరీ, సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. లోక్ భవన్‌లో సోమవారం గవర్నర్‌తో దాదాపు గంటకు పైగా సమావేశమయ్యారు.
త్రినేత్ర.న్యూస్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమ మైనింగ్, భూకబ్జాల పై విచారణ చేపట్టాలని భారత రాష్ట్ర సమితి శాసనసభ పక్షం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు (BRS MLAs, MLCs) రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు ఫిర్యాదు (Complaint) చేశారు. ఇండిపెండెంట్ జ్యుడీషియల్ ఎంక్వైరీ, సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. లోక్ భవన్‌లో సోమవారం గవర్నర్‌తో దాదాపు గంటకు పైగా సమావేశమయ్యారు. మంత్రి పొంగులేటి చేస్తున్న అక్రమ మైనింగ్‌ను, అరాచక భూకబ్జాలను గవర్నర్‌కు వివరించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
పొంగులేటికి చెందిన 'రాఘవ కనస్ట్రక్షన్స్' అనే కంపెనీ మైనింగ్ నిబంధనలను ఉల్లంఘించి, అక్రమంగా జంట జలాశయాల పరిధిలో మైనింగ్ నిషేధం ఉన్నప్పటికీ మైనింగ్ చేస్తున్నారన్నారు. సంబంధం లేని భూమిని చెరబట్టి ఎలాంటి మినరల్ డీలర్ లైసెన్స్, పొల్యూషన్ బోర్డ్ అనుమతులు, విద్యుత్ కనెక్షన్లు, పరిశ్రమల శాఖ అనుమతులు లేకుండానే రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా వందల కోట్ల ప్రజా సంపదను, రెవెన్యూ మంత్రి కుటుంబం కొల్లగొడుతుందన్నారు. అన్ని ఆధారాలతో సహా గవర్నర్ కు విజ్ఞాపన పత్రాన్ని అందజేసినట్లు చెప్పారు.
అందుకే తప్పించాలి...
రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి ఈ అంశంలో చర్యలు తీసుకోవాలని సభలో లేవనెత్తితే సభ నుంచి బహిష్కరించారన్నారు. రాఘవ కనస్ట్రక్షన్స్ కంపెనీ తప్పు చేసింది, దానికి సంబంధించి మా ప్రభుత్వమే కొన్ని నోటీసులు కూడా ఇచ్చిందని అసలు నిజాన్ని కాంగ్రెస్ నేతలు ఒప్పుకున్న విషయాన్ని గవర్నర్ వద్ద ప్రస్తావించినట్లు చెప్పారు. ఈ అంశంపై ఎంక్వైరీ పారదర్శకంగా జరగాలని, మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశామన్నారు. ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న పొంగులేటి తన ప్రభుత్వమే చేపట్టే విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. అందుకే ఆయన్ను బర్తరఫ్ చేసి విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తం..
రేవంత్ రెడ్డి కుటుంబమైనా, శ్రీనివాస్ రెడ్డి కుటుంబమైనా చర్యలు తీసుకుంటానని చెప్పిన రేవంత్, ఆధారాలతో సహా పొంగులేటి కుంభకోణాన్ని బయటపెడితే మౌనంగా ఉన్నారన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి దమ్ముంటే చర్యలు తీసుకొని తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, పొంగులేటి అక్రమ మైనింగ్ భూకబ్జాల పైన త్వరలోనే మరింత కార్యాచరణ ప్రకటిస్తామని కేటీఆర్ వెల్లడించారు.
తాజావార్తలు
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి

KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!




