త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG EAPCET 2026 | మే 17న టీజీ ఎప్‌సెట్ ఫ‌లితాలు విడుద‌ల‌..!

TG EAPCET 2026 | తెలంగాణ‌లోని ఇంజినీరింగ్, అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మ‌సీ కాలేజీల్లో 2026-27 విద్యాసంవ‌త్స‌రానికి ప్ర‌వేశాల నిమిత్తం నిర్వ‌హించిన టీజీ ఎప్‌సెట్ 2026 ఫ‌లితాల‌ను మే 17వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు.

S

Telangana | Published On May 16, 2026, 6.24 pm IST

TG EAPCET 2026 | మే 17న టీజీ ఎప్‌సెట్ ఫ‌లితాలు విడుద‌ల‌..!
Advertisement

TG EAPCET 2026 | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ‌లోని ఇంజినీరింగ్, అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మ‌సీ కాలేజీల్లో 2026-27 విద్యాసంవ‌త్స‌రానికి ప్ర‌వేశాల నిమిత్తం నిర్వ‌హించిన టీజీ ఎప్‌సెట్ 2026 ఫ‌లితాల‌ను మే 17వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు. ఎప్‌సెట్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆదివారం ఉద‌యం 11 గంట‌ల‌కు ఫ‌లితాలు అందుబాటులో ఉంటాయ‌ని క‌న్వీన‌ర్ వెల్ల‌డించారు.

ఈ ఏడాది ఎప్‌సెట్ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ను జేఎన్టీయూ హైద‌రాబాద్ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మ‌సీ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ను మే 4, 5 తేదీల్లో నిర్వ‌హించ‌గా 84,954 మంది హాజ‌ర‌య్యారు. ఇంజినీరింగ్ ప్ర‌వేశ‌ప‌రీక్ష మే 9, 10, 11 తేదీల్లో నిర్వ‌హించ‌గా 1,97,241 మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు.

ఫ‌లితాల కోసం ఈ వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి.. https://eapcet.tgche.ac.in/

Advertisement
Advertisement