Chicken | ఆ కోడికి మూడు కాళ్లు.. ఆసక్తిగా తిలకించిన జనాలు
Chicken | కోళ్లకు సాధారణంగా రెండు కాళ్లు ఉంటాయి. కానీ ఈ కోడికి మాత్రం మూడు కాళ్లు ఉన్నాయి. అలాంటి కోడి ఓ చికెన్ షాపులో దర్శనమిచ్చింది. మూడు కాళ్ల కోడిని అక్కడికి వచ్చిన వారు ఆసక్తిగా తిలకించారు.
Chicken | త్రినేత్ర న్యూస్ : కోళ్లకు సాధారణంగా రెండు కాళ్లు ఉంటాయి. కానీ ఈ కోడికి మాత్రం మూడు కాళ్లు ఉన్నాయి. అలాంటి కోడి ఓ చికెన్ షాపులో దర్శనమిచ్చింది. మూడు కాళ్ల కోడిని అక్కడికి వచ్చిన వారు ఆసక్తిగా తిలకించారు.
వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో మార్కండేయ గుడి సమీపంలోని అశోక్ అనే వ్యక్తి చికెన్ షాపు నిర్వహిస్తున్నాడు. అయితే ఆదివారం కోళ్లను తీస్తుండగా, మూడు కాళ్ల కోడి కనిపించింది. అతను కూడా ఆశ్చర్యపోయాడు. మూడు కాళ్లు ఉన్నప్పటికీ, సాధారణంగా రెండు కాళ్లతోనే అది నడిచింది. దీంతో చికెన్‌కు వచ్చిన వారంతా ఆ కోడిని చూసి ఆశ్చర్యపోయారు. జన్యులోపం కారణంగా అరుదుగా ఇలాంటి మూడు కాళ్ల కోళ్లు ఉత్పత్తవుతాయని మల్యాల పశువైద్యశాల డాక్టర్ రాజ్‌కుమార్ తెలిపారు.
తాజావార్తలు
- ●Bisleri | బిస్లరీ వాటర్ సురక్షితం కాదు.. తేల్చిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
- ●Road Accident | తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం.. 8 మంది మృత్యువాత
- ●Graduate MLC Elections | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. 12.69 లక్షల మంది దరఖాస్తు
- ●Horoscope | నవంబర్ 23 సోమవారం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
- ●Murder | గోదావరిఖనిలో కత్తులతో దాడి.. యువకుడి హత్య
- ●KTR Challenge to Revanth Reddy | కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే రాజకీయాలకు స్వస్తి.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్

Bisleri | బిస్లరీ వాటర్ సురక్షితం కాదు.. తేల్చిన ఎఫ్ఎస్ఎస్ఏఐ

Road Accident | తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం.. 8 మంది మృత్యువాత

Graduate MLC Elections | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. 12.69 లక్షల మంది దరఖాస్తు

Horoscope | నవంబర్ 23 సోమవారం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?




