Koppula Eshwar | సీఎం, మంత్రుల ప్రచారం వల్లే పంటలు ఎండిపోతున్నయ్
Koppula Eshwar | ఎల్‌నినో ఒంకతో "ఏ పంట వేయకండి, నష్టపోతారు" అని ముఖ్యమంత్రి, మంత్రులు ప్రచారం చేయడం వల్లే రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంటలు (Crops) ఎండిపోయాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) ఆరోపించారు.
- ఎల్‌నినో ఒంకతో ఏ పంట వేయొద్దని చెప్పారు
- ఇప్పుడు 20 లక్షల ఎకరాల్లో పొలాలు ఎండినయ్
- అడ్లూరికి సమస్యలు చెప్తే కలెక్టర్ దగ్గరకు తోలిస్తుండు
- దొంతాపూర్ పొలాల పరిశీలినలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్
Koppula Eshwar | త్రినేత్ర న్యూస్: ఎల్‌నినో ఒంకతో "ఏ పంట వేయకండి, నష్టపోతారు" అని ముఖ్యమంత్రి, మంత్రులు ప్రచారం చేయడం వల్లే రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంటలు (Crops) ఎండిపోయాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) ఆరోపించారు. స్థానిక మంత్రి లడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వయంగా ఇక్కడే ఉన్నప్పటికీ రైతుల కష్టాలను గాలికొదిలేశారని విమర్శించారు. సమస్య చెబితే కలెక్టర్ వద్దకు వెళ్లమని చెప్పడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. దొంతాపూర్ రోడ్డు అత్యంత అధ్వాన్నంగా తయారైందని, గతంలో మంజూరైన రూ.32 కోట్ల రోడ్డు పనులను కాంట్రాక్టర్లతో మాట్లాడి పనిచేయించే శక్తి కూడా ప్రస్తుత నాయకత్వానికి లేదని ఫైరయ్యారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామంలో సాగునీరు అందక ఎండిపోతున్న వరి, పత్తి పొలాలను శనివారం నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. పంటలు ఎండిపోయి తీవ్ర ఆందోళనలో ఉన్న మండల లింగయ్య, మండల భీమయ్య, చంద్రయ్య తదితర రైతులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడారు. రైతులు పెట్టుబడులు పెట్టినా చేతికి వచ్చే సమయంలో నీరు అందక పంటలు వృథా అవుతున్నాయని, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అవగాహనా రాహిత్యం వల్లే రాష్ట్రంలో రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కె.సి.ఆర్ సహకారంతో రూ.400 కోట్ల వ్యయంతో ఆర్.ఎఫ్.ఎల్ నుండి ముత్తూరు వరకు 14 లిఫ్ట్‌లను ఏర్పాటు చేశామన్నారు. అందులో దొంతాపూర్ లిఫ్ట్ ఒకటి అని తెలిపారు. గత 6 నెలలుగా దొంతాపూర్ లిఫ్ట్‌లో 2-3 మోటార్లు ఖరాబై ఆగిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గోదావరి పక్కనే ఉన్నా నీరందక పంటలు ఎండిపోవడం బాధాకరమన్నారు.
ఎల్ నినో ప్రభావంతో కరువు పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. గోదావరిలో నీరు ఉన్నప్పటికీ కన్నెపల్లి నుంచి ఎత్తిపోతలు చేపట్టకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. గతంలో కరోనా వంటి క్లిష్ట సమయంలో కూడా కేసీఆర్ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని గానీ, రైతు బంధును గానీ ఆపలేదని గుర్తుచేశారు.
రాష్ట్రంలోని 661 మండలాలకు గాను 365 కరువు మండలాలు ప్రకటించినప్పటికీ రైతులకు ఎలాంటి ఆర్థిక సహాయం అందించలేదని విమర్శించారు. మూడో పంటకు ఇస్తామన్న రైతు బంధు ఎగ్గొట్టారని, రైతు భీమాను కూడా సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి జీవనాధారమని, పిల్లర్స్ రిపేర్ చేస్తే సస్యశ్యామలం అవుతుందని చెప్పినా పట్టించుకోలేదని, ఇప్పుడు రైతులు నష్టపోతుంటే ఆలస్యంగా స్పందిస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వం వస్తే తప్ప రైతాంగానికి దిక్కు లేని పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎండిపోయిన పంటలకు పరిహారం అందించాలని, కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, అయ్యోరి రాజేష్, సంగి శేఖర్, పలువురు నాయకులు, స్థానిక బి.ఆర్.ఎస్ ప్రజాప్రతినిధులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Kedarnath | దీపావళికి కేదార్నాథ్ ముస్తాబు.. 20 క్వింటాళ్ల పూలతో అలంకరణ!
- ●KCR | అల్లం బుచ్చవ్వ మరణంపై కేసీఆర్ సంతాపం
- ●Ponguleti Srinivas Reddy | పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ సంకల్పం
- ●Virat Kohli | కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. 31 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన గుర్నూర్
- ●Mother Dies by Suicide with Children | అయ్యో! పిల్లలను నడుముకు కట్టుకుని పాకాలలో దూకిన తల్లి.. అసలేమైందంటే..
- ●Ramayana | "రామాయణ"లో సాయిపల్లవి పాత్రకు డబ్బింగ్ చెప్పిన సీరియల్ నటి ఎవరంటే?

Kedarnath | దీపావళికి కేదార్నాథ్ ముస్తాబు.. 20 క్వింటాళ్ల పూలతో అలంకరణ!

KCR | అల్లం బుచ్చవ్వ మరణంపై కేసీఆర్ సంతాపం

Ponguleti Srinivas Reddy | పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ సంకల్పం

Virat Kohli | కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. 31 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన గుర్నూర్



