Sanjay Kumar | వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తా.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్
Sanjay Kumar | వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ (Sanjay Kumar) స్పష్టం చేశారు. జగిత్యాల అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నానని చెప్పారు.
Sanjay Kumar | త్రినేత్ర.న్యూస్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ (Sanjay Kumar) స్పష్టం చేశారు. జగిత్యాల అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో అసలు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది ఎవరో ప్రజలకు తెలియదా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు. తనను క్రాస్ బ్రీడ్ నాయకుడని కేటీఆర్ సంబోధించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను రాజకీయ వ్యభిచారినైతే.. నువ్వు వ్యభిచార కొంప నడిపావా? గతంలో వైసీపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న నీదా క్రాస్ బ్రీడ్..? నాదా..?’ అని నిలదీశారు.
గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రశేఖర్ గౌడ్‌ను నిలబెట్టి.. జీవన్‌రెడ్డికి క్రాస్ ఓటేయించిన క్రాస్‌బ్రీడ్ నాయకుడు కేటీఆర్ అని దుయ్యబట్టారు. అక్రమ సంపాదనతో వచ్చిన అహంకారంతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కల్వకుంట్ల కుటుంబ అహంకారపూరిత వ్యాఖ్యలతోనే రాష్ట్రంలో వెలమ జాతి గౌరవం తగ్గుతున్నదని విమర్శించారు. కేటీఆర్ రాజకీయాల్లోకి రాక ముందు నుంచే తానూ, తన కుటుంబం రాజకీయాల్లో ఉన్నామని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చాక తన ఆస్తులు తగ్గాయే తప్ప పెరగలేదని వెల్లడించారు. జగిత్యాల జిల్లాకు ఎవరు ఏం చేశారో లెక్కలు తీద్దామని సవాల్ విసిరారు. 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మళ్లీ జగిత్యాల నుంచే పోటీ చేస్తానన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



