త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sanjay Kumar | పోలీసులు జోక్యం చేసుకోవాల్సిందే.. దేవుళ్ల ద‌గ్గ‌ర రాజ‌కీయ నాయ‌కుల పాట‌లు ఎందుకు?: జ‌గిత్యాల ఎమ్మెల్యే

Sanjay Kumar | గ‌ణేశ్ నిమ‌జ్జనాల (Ganesh Immersion) సంద‌ర్భంగా కేసీఆర్ (KCR) పాట‌లు పెట్టిన‌వారిపై పోలీసులు కేసులు పెట్ట‌డం, అడ్డుకోవడం వంటివి తెలిసిందే. తాజాగా విష‌యంపై జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజ‌య్ కుమార్ (Sanjay Kumar) స్పందించారు.

G

Telangana | Published On Sep 26, 2026, 12.41 pm IST

Sanjay Kumar | పోలీసులు జోక్యం చేసుకోవాల్సిందే.. దేవుళ్ల ద‌గ్గ‌ర రాజ‌కీయ నాయ‌కుల పాట‌లు ఎందుకు?: జ‌గిత్యాల ఎమ్మెల్యే
Advertisement

Sanjay Kumar | త్రినేత్ర న్యూస్‌: గ‌ణేశ్ నిమ‌జ్జనాల (Ganesh Immersion) సంద‌ర్భంగా కేసీఆర్ (KCR) పాట‌లు పెట్టిన‌వారిపై పోలీసులు కేసులు పెట్ట‌డం, అడ్డుకోవడం వంటివి తెలిసిందే. తాజాగా విష‌యంపై జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజ‌య్ కుమార్ (Sanjay Kumar) స్పందించారు. దేవుళ్ల దగ్గర రాజకీయ నాయ‌కుల పాటలు పెట్టడమెంటని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ విష సంస్కృతినే అని మండిప‌డ్డారు. హైదరాబాద్ (Hyderabad) సంస్కృతి జగిత్యాలకు (Jagtial) కూడా పాకిందన్నారు. వినాయకుడి దగ్గర పార్వతి, శివుడి పాటలు పెట్టాలని, కనీసం గ‌ణేశుడి వాహనం ఎలుక గురించి పాడిన అభ్యంతరం లేదని చెప్పారు. రాజకీయ నేతల పాటలు పెడితే పోలీసులు జోక్యం చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. దేవుడి పాటల విషయంలో రాజకీయాలు వద్దని చెప్పారు.

గణేశ్‌ నిమజ్జన వేడుకల్లో మాజీ సీఎం కేసీఆర్‌కు సంబంధించిన ‘దేఖ్‌లెంగే’, ‘గులాబీల జెండాలే రామక్క’ వంటి పాటలు, డైలాగులతో ట్యాంక్ బండ్, సెక్రటేరియట్ ప్రాంతాలు మారుమోగాయి. నిమజ్జన ఊరేగింపుల్లో యువకులు కేసీఆర్ పాటలకు పెద్ద ఎత్తున స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో వాటిని వైరల్ చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో రాజకీయ పాటలు ప్లే చేయడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. డీజే బాక్సులను స్వాధీనం చేసుకోవడం లాంటి ఘటనలు వివాదానికి దారితీశాయి.

Advertisement
Advertisement