త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DGP CV Anand | గ‌ణేశ్ నిమ‌జ్జ‌నాల్లో అప‌శృతి.. 13 మంది మృతి : డీజీపీ సీవీ ఆనంద్

DGP CV Anand | తెలంగాణ వ్యాప్తంగా గ‌ణేశ్ నిమ‌జ్జ‌న ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా ముగిసిన‌ప్ప‌టికీ.. ప‌లు ప్రాంతాల్లో ప్ర‌మాదాలు చోటు చేసుకున్నాయ‌ని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌తో స‌హా 13 మంది మృతి చెందార‌ని ఆయ‌న పేర్కొన్నారు.

S

Telangana | Published On Sep 26, 2026, 3.47 pm IST

DGP CV Anand | గ‌ణేశ్ నిమ‌జ్జ‌నాల్లో అప‌శృతి.. 13 మంది మృతి : డీజీపీ సీవీ ఆనంద్
Advertisement

DGP CV Anand | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ వ్యాప్తంగా గ‌ణేశ్ నిమ‌జ్జ‌న ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా ముగిసిన‌ప్ప‌టికీ.. ప‌లు ప్రాంతాల్లో ప్ర‌మాదాలు చోటు చేసుకున్నాయ‌ని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌తో స‌హా 13 మంది మృతి చెందార‌ని ఆయ‌న పేర్కొన్నారు. మ‌రో 26 మంది గాయ‌ప‌డ్డార‌ని చెప్పారు. తెలంగాణ మొత్తంలో 1.24 ల‌క్ష‌ల గ‌ణేశ్ విగ్ర‌హాల‌ను బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఏర్పాటు చేసి.. 10 రోజుల అనంత‌రం నిమ‌జ్జ‌నం చేశార‌ని తెలిపారు. ఇక 3.5 ల‌క్ష‌ల నుంచి 4 ల‌క్ష‌ల వ‌ర‌కు విగ్ర‌హాల‌ను నివాసాలు, గేటెడ్ క‌మ్యూనిటీ, అపార్ట్‌మెంట్‌ల‌లో ప్ర‌తిష్టించార‌ని పేర్కొన్నారు. నిమ‌జ్జ‌న వేడుక‌ల‌కు లక్షలాదిగా తరలివచ్చిన భక్తులను నియంత్రించడానికి, ఎటువంటి గొడవలు జరగకుండా చూడటానికి పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి, ట్రాఫిక్ తో పాటు భద్రతను కూడా పర్యవేక్షించారని వివరించారు. అంత విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ, ఈ దురదృష్టకర ప్రమాదాల్లో 13 మంది చనిపోవడం, 26 మంది గాయపడటం తీవ్ర విచారాన్ని నింపింద‌ని డీజీపీ పేర్కొన్నారు.

Advertisement
Advertisement