She Teams | గణేశ్ ఉత్సవాల్లో రెచ్చిపోయిన పోకిరీలు.. 2,935 మంది అదుపులోకి తీసుకున్న షీటీమ్స్..
She Teams | గణేశ్ ఉత్సవాల సందర్భంగా మహిళలు, యువతుల భద్రతకు హైదరాబాద్ నగర పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈవ్‌టీజింగ్, వేధింపులు తదితర కార్యకలాపాలకు పాల్పడిన 2,935 మందిని షీ టీమ్స్ అదుపులోకి తీసుకున్నాయి.
She Teams | గణేశ్ ఉత్సవాల సందర్భంగా మహిళలు, యువతుల భద్రతకు హైదరాబాద్ నగర పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈవ్‌టీజింగ్, వేధింపులు తదితర కార్యకలాపాలకు పాల్పడిన 2,935 మందిని షీ టీమ్స్ అదుపులోకి తీసుకున్నాయి. ఈ నెల 14 నుంచి 26 వరకు జరిగిన ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్, బాలాపూర్‌తో పాటు గణేశ్ మంటపాల వద్ద షీ టీమ్స్‌ను భారీగా మోహరించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్స్) ఆదేశాల మేరకు ప్రధాన గణేశ్ మంటపాలు, రద్దీ ప్రాంతాలు, నిమజ్జన మార్గాల్లో షీ టీమ్స్ నిరంతరం నిఘా వేశాయి. మహిళలు, యువతులపై వేధింపులను అరికట్టడమే లక్ష్యంగా ప్రత్యేక బృందాలు చురుగ్గా వ్యవహరించాయి.
అదుపులోకి తీసుకున్న వారిలో 858 మందికి విచారణ అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి హెచ్చరించి వదిలిపెట్టారు. మరో 69 మందికి శిక్ష పడింది. వీరిలో 24 మందికి రూ.1,050 జరిమానా విధించగా.. 40 మందికి సామాజిక సేవతోపాటు రూ.1,050 జరిమానా విధించారు. మరో ఐదుగురికి జరిమానాతోపాటు జైలు శిక్ష పడింది. ఉత్సవాల సమయంలో మహిళలు, యువతుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ఖైరతాబాద్, బాలాపూర్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్స్) ఎం శ్రీనివాస్ తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో వేధింపులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై షీ టీమ్స్ నిఘా వేశాయని వివరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Erravelli | ఎర్రవెల్లి సర్వే నంబర్లో కలిపారు.. పొంగులేటిని కలిసిన వెంకటాపూర్ రైతులు
సెప్టెంబర్ 29, 2026

TSLPRB | తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు జాతీయ అవార్డు
సెప్టెంబర్ 29, 2026

Revanth Reddy | తుమ్మిడిహెట్టి నిర్మాణానికి అనుమతులు ఇప్పించండి.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రిక్వెస్ట్
సెప్టెంబర్ 29, 2026
తాజావార్తలు
- ●Erravelli | ఎర్రవెల్లి సర్వే నంబర్లో కలిపారు.. పొంగులేటిని కలిసిన వెంకటాపూర్ రైతులు
- ●Ntr | డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు - జూనియర్ ఎన్టీఆర్ స్టైలిష్ ఎంట్రీ
- ●TSLPRB | తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు జాతీయ అవార్డు
- ●Revanth Reddy | తుమ్మిడిహెట్టి నిర్మాణానికి అనుమతులు ఇప్పించండి.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రిక్వెస్ట్
- ●Yashmi Gowda | రొమాంటిక్ సీరియల్‌తో తెలుగులోకి బిగ్‌బాస్ బ్యూటీ రీఎంట్రీ
- ●RS Praveen Kumar | ఈనాడు రాసింది..తప్పుడు వార్త! ఆ మాత్రం తెలియకపోతే ఎలా?

Erravelli | ఎర్రవెల్లి సర్వే నంబర్లో కలిపారు.. పొంగులేటిని కలిసిన వెంకటాపూర్ రైతులు

Ntr | డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు - జూనియర్ ఎన్టీఆర్ స్టైలిష్ ఎంట్రీ

TSLPRB | తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు జాతీయ అవార్డు

Revanth Reddy | తుమ్మిడిహెట్టి నిర్మాణానికి అనుమతులు ఇప్పించండి.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రిక్వెస్ట్



