త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jagtial Medical College | జిమ్ జిమ్ తార‌.. జిమ్ జిమ్ తార‌.. దిగొచ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం

Jagtial Medical College | జ‌గిత్యాల మెడిక‌ల్ కాలేజీ( Jagtial Medical College ) నూత‌న భ‌వ‌న నిర్మాణ ప‌నులు వేగ‌వంతం చేయాలంటూ, విద్యార్థుల‌కు క‌నీస మౌలిక వ‌స‌తులు క‌ల్పించాల‌ని మెడికోలు( Medical Students ) ఆందోళ‌న చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ నిర‌స‌న కూడా వినూత్నంగా చేప‌ట్టారు.

S

Telangana | Published On Oct 9, 2026, 1.59 pm IST

Jagtial Medical College | జిమ్ జిమ్ తార‌.. జిమ్ జిమ్ తార‌.. దిగొచ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం
Advertisement

Jagtial Medical College | త్రినేత్ర న్యూస్ : జ‌గిత్యాల మెడిక‌ల్ కాలేజీ( Jagtial Medical College ) నూత‌న భ‌వ‌న నిర్మాణ ప‌నులు వేగ‌వంతం చేయాలంటూ, విద్యార్థుల‌కు క‌నీస మౌలిక వ‌స‌తులు క‌ల్పించాల‌ని మెడికోలు( Medical Students ) ఆందోళ‌న చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ నిర‌స‌న కూడా వినూత్నంగా చేప‌ట్టారు. సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న జిమ్ జిమ్ తార( Jim Jim Tara ) పాట‌కు అనుగుణంగా జ‌గిత్యాల మెడిక‌ల్ కాలేజీ విద్యార్థులు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. జిమ్ జిమ్ తార.. జిమ్ జిమ్ తార.. కాలేజ్ ఎక్కడ చిన్నోడా..! అని నిన‌దించారు.

మొత్తానికి మెడికోల ఆందోళ‌న‌లకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం దిగొచ్చింది. విద్యార్థుల ద‌గ్గ‌రికి జ‌గిత్యాల క‌లెక్ట‌ర్ వెళ్లి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు చొర‌వ తీసుకున్నారు. డిసెంబర్‌ 15 నాటికి మెడికల్‌ కాలేజీ భవనం, హాస్టల్‌ భవనాలు, ప్లేగ్రౌండ్‌, మెస్‌ తదితర మౌలిక వసతుల నిర్మాణ పనులను పూర్తి చేసి ఇస్తామని మంత్రులు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్ హామీ ఇచ్చారు. మంత్రులు ఇచ్చిన హామీ కలెక్టర్‌ ప్రకటించడంతో విద్యార్థులు స‌మ్మె విర‌మించారు.

Advertisement
Advertisement