త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jagadeesh Reddy | 27 వేల మెగావాట్ల క‌రెంటుంది.. ఇంకా కొత్త‌గా కొని ఏం చేస్త‌రు?

Jagadeesh Reddy | రాష్ట్రంలో 27 వేల మెగావాట్ల క‌రెంటు (Electricity) ఉంద‌ని.. డిమాండ్ మాత్రం 17 వేల వ‌ర‌కే ఉంద‌ని మాజీ మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి (Jagadeesh Reddy) అన్నారు.

S

Telangana | Published On Nov 3, 2026, 1.39 pm IST

Jagadeesh Reddy | 27 వేల మెగావాట్ల క‌రెంటుంది.. ఇంకా కొత్త‌గా కొని ఏం చేస్త‌రు?
Advertisement
  • డిమాండ్ 20 వేల మెగావాట్ల‌ లోపే ఉన్నా క‌రెంటు ఇయ్య‌డానికి చేత‌నైత‌లే
  • ఇండ్ల ఏదో దొంగ ముచ్చ‌ట‌ ఉంది
  • ఏం ఉత్ప‌త్తి చేయాల‌న్నా జెన్‌కో, సింగ‌రేణితోనే చేయాలే
  • ప్ర‌భుత్వ ప్ర‌తిపాద‌న‌లు ప్ర‌జ‌లకు బ‌రువ‌యేట‌ట్టే ఉన్న‌య్‌
  • అనుమ‌తులు ఇయ్యొద్దు
  • ఈఆర్సీ కార్యాల‌యం వ‌ద్ద జ‌గ‌దీశ్‌రెడ్డి

Jagadeesh Reddy | త్రినేత్ర న్యూస్: రాష్ట్రంలో 27 వేల మెగావాట్ల క‌రెంటు (Electricity) ఉంద‌ని.. డిమాండ్ మాత్రం 17 వేల వ‌ర‌కే ఉంద‌ని మాజీ మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి (Jagadeesh Reddy) అన్నారు. ఉన్న క‌రెంటునే రైతాంగానికి ఇవ్వ‌డానికి కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి చేత‌గావ‌డం లేద‌న్నారు. కొత్త క‌రెంటు కొని ఏం చేస్తార‌ని నిల‌దీశారు. ఇండ్ల ఏదో దొంగ ముచ్చ‌ట ఉంద‌ని మండిప‌డ్డారు. ఏం చేయాల‌న్నా జెన్‌కో, సింగ‌రేణితోనే ఉత్ప‌త్తి చేయాల‌ని డిమాండ్ చేశారు. సాగ‌ర్‌, శ్రీ‌శైలంల నీళ్ల‌ను ఆపుకొని ఉంటే ఇవాళ క‌రెంటు త‌యారు చేసుకునేవాళ్ల‌మ‌న్నారు. మంగ‌ళ‌వారం ఈఆర్సీ కార్యాల‌యంలో ప్ర‌భుత్వ ప్రతిపాద‌న‌ల‌పై అభిప్రాయం తెలియ‌జేసిన అనంత‌రం బ‌య‌ట మీడియాతో మాట్లాడారు.

హైబ్రిడ్ విద్యుత్ కొనాల‌ని చెప్పి అనుమ‌తివ్వ‌డానికి ఈఆర్సీ ముంద‌ట ప్ర‌తిపాద‌న‌లు పెట్టుకుంటే వారు ప‌బ్లిక్ హియ‌రింగ్ కోసం పిలిచారు. ఈరోజు 7,800 మెగావాట్ల విద్యుత్‌ను హైబ్రిడ్ పద్ధతిలో కొనేందుకు పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేశారు. ఉన్న విద్యుత్‌నే ప్ర‌జ‌ల‌కు ఇవ్వ‌కుండా ఇబ్బంది పెడుతున్నారు. ప్లాంట్ల‌ను కూడా బంద్ పెడుతున్నారు. కేసీఆర్ ఉన్న రోజు తీసుకున్న చ‌ర్య‌ల వ‌ల్ల ఇవాళ దాదాపు 27 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంది. డిమాండ్ మాత్రం 17 వేల వ‌ర‌కు ఉంది. ఒక్కో రోజు 20 వేల మెగావాట్ల‌కు వ‌స్తుంది. అయినా కూడా ప్ర‌భుత్వం రైతాంగానికి క‌రెంటు ఇస్త‌లేదు.

ఒక్క కిలోమీట‌ర్ లైన్ గుంజ‌లే

సాయంత్రం 6 నుంచి ఉద‌యం వ‌ర‌కు క‌రెంటు వ‌స్త‌లేదు. పొద్దుందాంక కూడా ఇస్త‌మ‌న్న‌దానికి అద్ద‌గంట ముందే తీసేస్తున్న‌రు. 2014 కంటే ముందు రోజులే వ‌చ్చిన‌య‌ని రైతులు చెప్పిన విష‌యాన్ని క‌మిష‌న‌ర్‌కు తెలియ‌జేశాం. ఈ ప్ర‌భుత్వం వ‌చ్చిన్నుంచి ఒక్క కొత్త ట్రాన్స్‌ఫార్మ‌ర్ గానీ, ఒక్క కిలోమీట‌ర్ లైన్‌గానీ గుంజ‌లేదు. విద్యుత్ డిమాండ్ అకస్మాత్తుగా పెరిగింద‌ని మాట్లాడుతున్న‌రు. కొవిడ్ వ‌చ్చిన‌ప్పుడు ఒక్క‌టేసారి 4 వేల మెగావాట్ల డిమాండ్ పెరిగింది. 10 వేల నుంచి 14 వేలకు పెరిగింది. అయినా స‌రే ఒక్క నిమిషం పోకుండా ప‌రిశ్ర‌మ‌ల ద‌గ్గ‌రి నుంచి ఇండ్ల వ‌ర‌కు క‌రెంటు ఇచ్చినం. కానీ ఇవాళ అన్ని ఏర్పాట్లు ఉన్న‌ప్ప‌టికీ క‌రెంటు ఇయ్య‌డానికి చేత‌నైత‌లేదు ఈ ప్ర‌భుత్వానికి. ప్ర‌జ‌ల‌కు గాలికి వ‌దిలేశారు.

ఉన్న క‌రెంటునే ఇయ్య‌లేక‌పోతున్న‌రు. ఇంకా కొత్త క‌రెంటు కొని ఏం చేస్త‌రు? దీంట్ల ఏందో మ‌త‌ల‌బు ఉంది. ఇందులో ఏందో దొంగ విష‌యం ఉంది. అక్క‌ర్లేనిది కొంటే ప్ర‌జ‌ల మీద భారం ప‌డుత‌ది. ట్రూ ఆఫ్ చార్జెస్ అని పెంచుతున్న‌రు. అంటే ఏందంటే వాడ‌ని కరెంటుకు కూడా ప్ర‌జ‌ల మీద బిల్లులు వేస్తున్న‌రు. ఇవాళ ఈ ఏడెనిమిది వేల మెగావాట్లు కొనుమ‌ని చెప్పి అనుమ‌తిస్తే ఇంకా ఈ చార్జీలు పెరుగుత‌య్‌.

క‌రెంటు కొన్న‌ట్టు చేసి ఆ డ‌బ్బుల్ని పంచుకుంట‌రు. చివ‌రికి వినియోగ‌దారుల మీద భారం వేస్త‌రు. ఈ దొంగ వ్య‌వ‌హారం ఇండ్ల క‌న‌వ‌డుతుంది. హైడ‌ల్ విద్యుత్ కూడా ఉత్ప‌త్తి చేసుకునే అవ‌కాశం ఉండే. సాగ‌ర్‌, శ్రీ‌శైలంలో నీళ్లు ఉండే. ఆ వాట‌ర్‌ను మ‌నం ఆపుకొని క‌రెంటు ఉత్ప‌త్తి చేసుకునే అవ‌కాశం ఉండే. ఆ నీళ్ల‌ను కూడా ఆంధ్రాకు వ‌దిలేసిండ్రు. ఉన్న‌య్ వ‌దిలేసి.. లేనియి కొనుకొచ్చి ప్ర‌జ‌ల మీద భారం వేసుడే త‌ప్పా ఇంకోటి లేదు. నిజంగా ఈ ప్ర‌భుత్వ ప్ర‌తిపాద‌న‌లు ప్ర‌జ‌ల కోసం పెట్టిన‌వి కావు. వాటిని తిర‌స్క‌రించాల‌ని చెప్పాం. ఏదైనా ఉత్ప‌త్తి చేయ‌ద‌ల‌చుకుంటే జెన్‌కో, సింగ‌రేణి ద్వారానే చేయాలి. ప్రైవేట్ వాళ్ల‌కు ఇష్ట‌మొచ్చిన ధ‌ర‌లు ఇచ్చి కొన‌డానికి అనుమ‌తి ఇవ్వొద్ద‌ని చెప్పి విజ్ఞ‌ప్తి చేశాం అని జ‌గ‌దీశ్‌రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్:

ElectricityERCJagadeesh ReddyJENCOProposalsSingareniTelangana
Advertisement
Advertisement