LG India | ఎల్జీ టీవీలు ఉన్నవారికి బంపర్ ఆఫర్.. 170కి పైగా ఫ్రీ చానల్స్..
LG India | ఎల్‌జీ ఇండియా తన ఎల్‌జీ ఛానల్స్ సేవలను మరింత విస్తరిస్తోంది. భారతీయ వినియోగదారులకు బాలీవుడ్ సినిమాలు, ప్రాంతీయ భాషా కార్యక్రమాలు సహా 170కి పైగా ఉచిత ఛానళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎలాంటి అదనపు సబ్‌స్క్రిప్షన్ లేదా ప్రత్యేక హార్డ్‌వేర్ అవసరం లేకుండానే ఎల్‌జీ స్మార్ట్ టీవీల్లో వీటిని వీక్షించవచ్చు.
LG India | ఎల్జీ ఇండియా తన ఎల్‌జీ ఛానల్స్ సేవలను మరింత విస్తరిస్తోంది. భారతీయ వినియోగదారులకు బాలీవుడ్ సినిమాలు, ప్రాంతీయ భాషా కార్యక్రమాలు సహా 170కి పైగా ఉచిత ఛానళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎలాంటి అదనపు సబ్‌స్క్రిప్షన్ లేదా ప్రత్యేక హార్డ్‌వేర్ అవసరం లేకుండానే ఎల్‌జీ స్మార్ట్ టీవీల్లో వీటిని వీక్షించవచ్చు. దేశంలో కనెక్టెడ్ టీవీల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తన ఉచిత ప్రకటనల ఆధారిత స్ట్రీమింగ్ టెలివిజన్ (ఫాస్ట్) సేవ అయిన ఎల్‌జీ ఛానల్స్‌ను విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్‌లో 170కి పైగా ఉచిత ఛానళ్లు అందుబాటులో ఉన్నాయి. వినోదం, వార్తలు, సినిమాలు, జీవనశైలి, పిల్లల కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు, సంగీతం వంటి విభాగాలకు చెందిన ఛానళ్లను ఇందులో అందిస్తోంది. వెబ్‌ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఎల్‌జీ స్మార్ట్ టీవీల్లో ఈ సేవ నేరుగా అందుబాటులో ఉంటుంది. ప్రత్యేక పరికరాలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా, నెలవారీ సబ్‌స్క్రిప్షన్ చెల్లించకుండానే కార్యక్రమాలను వీక్షించవచ్చు.
ఉచితంగా వినోదం..
ఎల్‌జీ తన కంటెంట్ వ్యూహంలో భాగంగా హిందీ సినిమాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. బాలీవుడ్ చిత్రాలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావడంతోపాటు పంజాబీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, తెలుగు తదితర ప్రాంతీయ భాషల్లోనూ కార్యక్రమాలను అందిస్తోంది. ప్రకటనల ఆధారంగా ఉచితంగా ప్రసారమయ్యే ఫాస్ట్ విధానంలో డిజిటల్ ప్రకటనలను చేర్చడం ద్వారా వినియోగదారులకు ఉచిత వినోదాన్ని అందించడంతోపాటు ప్రకటనదారులకు కూడా కొత్త అవకాశాలను కల్పిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ కంటెంట్ సంస్థలు, ప్రసార సంస్థలతో భాగస్వామ్యాలను కొనసాగిస్తూ కొత్త కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
డిజిటల్ కంటెంట్ సేవలపై దృష్టి..
భారత స్మార్ట్ టీవీ మార్కెట్లో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో టీవీల హార్డ్‌వేర్‌తో పాటు సాఫ్ట్‌వేర్, డిజిటల్ కంటెంట్ సేవలపైనా కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాంతీయ భాషలు, బాలీవుడ్ సినిమాలు, వార్తలు, వినోద కార్యక్రమాలతో ఎల్‌జీ ఛానల్స్‌ను మరింత విస్తరించడం ద్వారా వినియోగదారులను తమ ప్లాట్‌ఫామ్‌కు ఆకర్షించాలని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ భావిస్తోంది. టీవీ కొనుగోలు చేసిన తర్వాత కూడా వినియోగదారులకు నిరంతర డిజిటల్ కంటెంట్ సేవలను అందిస్తూ భారత కనెక్టెడ్ టీవీ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jagadeesh Reddy | 27 వేల మెగావాట్ల కరెంటుంది.. ఇంకా కొత్తగా కొని ఏం చేస్తరు?
- ●Bombay High Court | దియా మీర్జా దీపావళి వీడియోపై వివాదం.. బీఎంసీ చర్యలపై బాంబే హైకోర్టు ఆగ్రహం
- ●Temple Wearable | తలకు ధరించే సరికొత్త వేరబుల్ డివైస్.. భారత్‌లో అమ్మకాలు షురూ.. ఏంటిది, ఎలా పనిచేస్తుంది..?
- ●Indian Navy | ఇండియన్ నేవీ డేరింగ్ ఆపరేషన్.. సముద్ర దొంగల ఆటకట్టించి.. 20 మందిని రక్షించిన భారత నౌకాదళం
- ●Indian sailor | ఒమన్ తీరంలో భారతీయ నౌకపై దాడి.. గుజరాత్ నావికుడు మృతి
- ●Baththa Movie Review | పెద్ద రౌడీ వాష్‌రూమ్‌లో ఎనిమిది రోజులు చిక్కుకుపోతే...విజయ్ సేతుపతి బత్తా మూవీ ఎలా ఉందంటే?

Jagadeesh Reddy | 27 వేల మెగావాట్ల కరెంటుంది.. ఇంకా కొత్తగా కొని ఏం చేస్తరు?

Bombay High Court | దియా మీర్జా దీపావళి వీడియోపై వివాదం.. బీఎంసీ చర్యలపై బాంబే హైకోర్టు ఆగ్రహం

Temple Wearable | తలకు ధరించే సరికొత్త వేరబుల్ డివైస్.. భారత్‌లో అమ్మకాలు షురూ.. ఏంటిది, ఎలా పనిచేస్తుంది..?

Indian Navy | ఇండియన్ నేవీ డేరింగ్ ఆపరేషన్.. సముద్ర దొంగల ఆటకట్టించి.. 20 మందిని రక్షించిన భారత నౌకాదళం



