Passport Mela | 21న పాస్‌పోర్టు మేళా.. వివరాలివే..
Passport Mela | పాస్‌పోర్ట్ సేవల కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులకు ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం( Passport Office ) గుడ్‌న్యూస్ వినిపించింది. ఈ నెల 21న పాస్‌పోర్టు మేళా( Passport Mela ) నిర్వహించాలని నిర్ణయించింది.
Passport Mela | త్రినేత్ర న్యూస్ : పాస్‌పోర్ట్ సేవల కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులకు ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం( Passport Office ) గుడ్‌న్యూస్ వినిపించింది. ఈ నెల 21న పాస్‌పోర్టు మేళా( Passport Mela ) నిర్వహించాలని నిర్ణయించింది. పెరుగుతున్న దరఖాస్తుల సంఖ్య, అపాయింట్‌మెంట్ల కోసం నెలకొన్న నిరీక్షణ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా పాస్‌పోర్ట్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి రచ్చయ్య వెల్లడించారు. ఈ పాస్‌పోర్టు మేళాలో భాగంగా సాధారణ పాస్‌పోర్ట్, తత్కాల్ పాస్‌పోర్ట్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) సేవలకు సంబంధించి సుమారు 4 వేల అపాయింట్‌మెంట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు.
ఈ అపాయింట్‌మెంట్లను నవంబర్ 3 నుంచి విడుదల చేస్తామని వివరించారు. హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలోని అన్ని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల పరిధిలో ఈ అపాయింట్‌మెంట్లు అందుబాటులో ఉంటాయన్నారు. పాస్‌పోర్ట్ సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా ప్రజలకు అందించడంతో పాటు దరఖాస్తుదారులకు నిరీక్షణ సమయాన్ని తగ్గించడమే ఈ ప్రత్యేక మేళా లక్ష్యమని ఆర్‌పీఓ వెల్లడించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Ground Water | రంగారెడ్డి జిల్లాలో అడుగంటిన భూగర్భ జలాలు.. ఎండిపోతున్న బోర్లు
- ●Rain Alert | నేడు నల్లగొండ, నాగర్కర్నూల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు..!
- ●CM Revanth Reddy | ఒలింపిక్స్లో పతకాలు సాధించడమే లక్ష్యం
- ●Hyderabad | బాణసంచా దుకాణానికి దరఖాస్తు చేసుకోండిలా.. కావాల్సిన ధృవపత్రాలు ఇవే..
- ●Tiger centipede | కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలో అరుదైన జెర్రి
- ●November Lucky Horoscope | నవంబర్లో ఈ 4 రాశులకు అదృష్టం.. ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని లాభాలు!

Ground Water | రంగారెడ్డి జిల్లాలో అడుగంటిన భూగర్భ జలాలు.. ఎండిపోతున్న బోర్లు

Rain Alert | నేడు నల్లగొండ, నాగర్కర్నూల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు..!

CM Revanth Reddy | ఒలింపిక్స్లో పతకాలు సాధించడమే లక్ష్యం

Hyderabad | బాణసంచా దుకాణానికి దరఖాస్తు చేసుకోండిలా.. కావాల్సిన ధృవపత్రాలు ఇవే..



