త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rain Alert | నేడు న‌ల్ల‌గొండ‌, నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాల్లో అత్యంత భారీ వ‌ర్షాలు..!

Rain Alert | మంగ‌ళ‌వారం న‌ల్ల‌గొండ‌, నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాల్లో అత్యంత భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది.

S

Telangana | Published On Nov 3, 2026, 7.28 am IST

Rain Alert | నేడు న‌ల్ల‌గొండ‌, నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాల్లో అత్యంత భారీ వ‌ర్షాలు..!
Advertisement

Rain Alert | త్రినేత్ర న్యూస్ : మంగ‌ళ‌వారం న‌ల్ల‌గొండ‌, నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాల్లో అత్యంత భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. ఎందుకంటే న‌ర‌సాపురం - నెల్లూరు మ‌ధ్య సోమ‌వారం అర్ధ‌రాత్రి తీవ్ర తుపాను మురసు తీరం దాటి తెలంగాణ వైపు దూసుకువ‌స్తోంది. ఈ క్ర‌మంలో న‌ల్ల‌గొండ‌, నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్ జారీ చేశారు. మొత్తానికి ఈ రెండు జిల్లాల్లో కొన్ని చోట్ల 20 సెం.మీ. వ‌ర‌కు వ‌ర్ష‌పాతం న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంది. ఇక మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, వ‌న‌ప‌ర్తి, సూర్యాపేట జిల్లాల‌కు ఆరెంజ్ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

ఇక ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో సాయంత్రం నుండి మరుసటి రోజు ఉదయం వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో 120-150 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవ‌కాశం ఉంది.

ట్యాగ్స్:

Cyclone MurasuIMD HyderabadNagarkurnoolNallagondaOrange AlertRain AlertRed AlertTelangana
Advertisement
Advertisement