Ground Water | రంగారెడ్డి జిల్లాలో అడుగంటిన భూగర్భ జలాలు.. ఎండిపోతున్న బోర్లు
Ground Water | రంగారెడ్డి జిల్లాలో భూగర్భ జలాలు( Ground Water ) అడుగంటి పోయాయి. జిల్లాలోని 27 మండలాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇటీవల విడుదలైన భూగర్భ జల నివేదిక ప్రకారం.. గతేడాది ఇదే సమయంలో 6.14 మీటర్లుగా ఉన్న సగటు భూగర్భ జలమట్టం, ఈ ఏడాది అక్టోబర్ నాటికి 12.75 మీటర్లకు పడిపోయినట్లు నివేదికలో వెల్లడైంది.
Ground Water | త్రినేత్ర న్యూస్ : రంగారెడ్డి జిల్లాలో భూగర్భ జలాలు( Ground Water ) అడుగంటి పోయాయి. జిల్లాలోని 27 మండలాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇటీవల విడుదలైన భూగర్భ జల నివేదిక ప్రకారం.. గతేడాది ఇదే సమయంలో 6.14 మీటర్లుగా ఉన్న సగటు భూగర్భ జలమట్టం, ఈ ఏడాది అక్టోబర్ నాటికి 12.75 మీటర్లకు పడిపోయినట్లు నివేదికలో వెల్లడైంది.
ఈ సందర్భంగా భూగర్భ జల శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. బలహీనమైన రుతుపవనాల కారణంగా ఈ ఏడాది వర్షాల్లేవు. దాంతో భూగర్భ జలాలు కూడా అడుగంటి పోయాయి. అంతేకాకుండా అక్రమంగా వేసిన బోర్లు కూడా భూగర్భ జలాలు పడిపోవడానికి మరో కారణమని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో గృహ వినియోగానికి సంబంధించిన బోర్లు కూడా ఎండిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
గతేడాది అక్టోబర్‌తో పోల్చితే.. ఈ ఏడాది అక్టోబర్‌లో జిల్లాలోని 27 మండలాల్లో సగటు భూగర్భ జలమట్టాలు పడిపోయాయి. ఏ మండలంలోనూ నీటి పెరుగుదల నమోదు కాలేదు. ఇక 84 బావులను పరిశీలించగా, కేవలం రెండు బావుల్లో మాత్రమే నీటి మట్టం పెరిగింది. మిగతా బావుల్లో నీటిమట్టాలు పూర్తిగా తగ్గిపోయాయని జీడబ్ల్యూడీ అధికారులు పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లాలోని 27 మండలాల్లో, కేవలం షాబాద్‌లోనే అత్యధికంగా 6.5 శాతం వర్షపాతం నమోదు కాగా, ఏడు మండలాల్లో సాధారణ వర్షపాతం, మిగిలిన 19 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. రాజేంద్రనగర్‌లో 20.8 శాతం, మాడ్గుల్, ఫరూఖ్‌నగర్‌లలో 23 శాతం చొప్పున, కందుకూరులో 28.1 శాతం, చౌడర్‌గూడెంలో 28.9 శాతం, మహేశ్వరంలో 30.9 శాతం, కడ్తాల్‌లో 31.5 శాతం, ఆమన్‌గల్‌లో 32.7 శాతం, కొత్తూరులో 33 శాతం, బాలాపూర్‌లో 35.3 శాతం, గండిపేటలో 36.8 శాతం, శంషాబాద్‌లో 37.8 శాతం, తలకొండపల్లిలో 41 శాతం, హయత్ నగర్‌లో 41.3 శాతం, మంచాలలో 41.9 శాతం, సరూర్‌నగర్‌లో 42.5 శాతం, ఇబ్రహీంపట్నంలో 44.6 శాతం, యాచారంలో 46.3 శాతం, అబ్దుల్లాపూర్ మెట్‌లో 47.9 శాతం లోటు వర్షపాతం నమోదైంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Rain Alert | నేడు నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు..!
- ●CM Revanth Reddy | ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే లక్ష్యం
- ●Hyderabad | బాణసంచా దుకాణానికి దరఖాస్తు చేసుకోండిలా.. కావాల్సిన ధృవపత్రాలు ఇవే..
- ●Tiger centipede | కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలో అరుదైన జెర్రి
- ●November Lucky Horoscope | నవంబర్‌లో ఈ 4 రాశులకు అదృష్టం.. ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని లాభాలు!
- ●Horoscope | నవంబర్ 3 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక లాభనష్టాలు..!

Rain Alert | నేడు నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు..!

CM Revanth Reddy | ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే లక్ష్యం

Hyderabad | బాణసంచా దుకాణానికి దరఖాస్తు చేసుకోండిలా.. కావాల్సిన ధృవపత్రాలు ఇవే..

Tiger centipede | కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలో అరుదైన జెర్రి



