Baththa Movie Review | పెద్ద రౌడీ వాష్‌రూమ్‌లో ఎనిమిది రోజులు చిక్కుకుపోతే…విజయ్ సేతుపతి బత్తా మూవీ ఎలా ఉందంటే?
విజయ్ సేతుపతి హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ నిర్మించిన బత్తా మూవీ పెద్ద హిట్‌గా నిలిచింది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన ఈ తమిళ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
Entertainment | Published On Nov 3, 2026, 11.44 am IST
Bhattha Movie Review | ఓ మనిషిలోని అహాన్ని పొగొట్టడానికి, వారి ఆలోచనధోరణిని మార్చడానికి పెద్ద అనుభవాలు అవసరం లేదు. కఠిన మనస్కులుగా సమాజం దృష్టిలో ముద్రపడిన వారిలో కొన్నిసార్లు చిన్న చిన్న సంఘటనలే మార్పుకు కారణమవుతాయని బత్తా సినిమాతో దర్శకుడు బాలాజీ మెసేజ్ ఇచ్చారు. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా నటించిన ఈ సినిమాను కోలీవుడ్ (Kollywood)డైరెక్టర్ అట్లీ నిర్మించారు. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ తమిళ మూవీ ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) రిలీజైంది. బత్తా ఎలా ఉందంటే?
రౌడీ బత్తా....
భక్సవత్సలం అలియాస్ బత్తా పేరుమోసిన రౌడీ. కోపం ఎక్కువ. అతడి పేరు చెబితే ఊరివాళ్లంతా వణికిపోతుంటారు. తనకు ఎదురుతిరిగిన వారు ఎవరైనా వదిలిపెట్టడు. చేతులు కాళ్లు విరిచేస్తుంటాడు . అవసరమైతే ప్రాణాలు తీయడానికి వెనుకాడడు. ఆ కోపం ఇంట్లో భార్య కణిమతో పాటు కూతురు తేన్‌మోళిపై చూపిస్తుంటాడు. బత్తా ఓ రౌడీని కొడుతుండగా శబరి అనే చిన్నపిల్లాడు చూస్తాడు. బత్తా పట్ల శబరిలో భయం పెరిగిపోతుంది.
స్కూల్ ఎగ్జామ్స్ చివరి రోజు శబరి దగ్గర ఉన్న బొమ్మను టీచర్ లాక్కొని స్టాఫ్‌రూమ్‌లో దాచేస్తుంది. హాలీడేస్ కారణంగా స్కూల్ మూసేస్తారు. దొంగతనం స్కూల్‌లోకి వచ్చి స్టాఫ్‌రూమ్‌లోని బొమ్మను తీసుకుంటాడు శబరి. అదే టైమ్‌లో బాత్రూమ్ రావడంతో స్కూల్‌లోని వాష్‌రూమ్‌కు వెళతాడు. తన పని పూర్తిచేసుకొని వాష్‌రూమ్ డోర్‌కు గొళ్లెం పెడతాడు. అనుకోకుండా అదే వాష్‌రూమ్‌కు బత్తా వస్తాడు. శబరి బయటి నుంచి గొళ్లెం వేయడంతో బత్తా అందులోనే ఇరుక్కుపోతాడు.
వాష్‌రూమ్ లోపల ఉన్నది బత్తా అనే విషయం తెలిసిన శబరి గొళ్లెం తీయకుండా స్కూల్ నుంచి పారిపోతాడు. దాంతో బత్తా ఆ వాష్‌రూమ్‌లోనే ఇరుక్కుపోతాడు. బయటకు వెళ్లేందుకు దారి దొరక్క అందులోనే ఎనిమిది రోజులు ఉంటాడు. చివరకు శబరినే బత్తా స్కూల్‌లో ఇరుక్కుపోయిన విషయం అందరికి చెబుతాడు. ప్రాణాలతో బయటపడిన బత్తా తనను. వాష్‌రూమ్‌లో బంధించి చంపాలని చూసిన వాడిని పట్టుకోవాలని పగతో రగిలిపోతుంటాడు? ఆ తర్వాత ఏమైంది? తాను వాష్‌రూమ్‌లో చిక్కుకుపోవడానికి శబరి కారణమని బత్తాకు తెలిసిందా? ఈ సంఘటన బత్తాలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? భార్యాపిల్లల మంచి మనసును అర్తం చేసుకున్నాడా? కరుడుగట్టిన రౌడీ అయిన బత్తా ఎలా మంచివాడిగా మారిపోయాడు అన్నదే ఈ మూవీ కథ.
అహంభావంతో...
హ్యూమన్ ఎమోషన్స్‌కు ప్రాధాన్యమిస్తూ చిన్న చిన్న కథలతో ఆడియెన్స్‌ను మెప్పిస్తున్నారు నవతరం దర్శకులు. బత్తా కూడా అలాంటి ప్రయత్నమే. కోపం, అహంభావంతో బతికే ఓ రౌడీలో చిన్నపిల్లాడి అమాయకత్వం, మంచితనం ఎలా మార్పును తీసుకొచ్చాయన్నది ఆలోచనాత్మకంగా దర్శకుడు బాలాజీ చూపించారు.
ఆకారణమైన ద్వేషం...
పైకి కఠినంగా కనిపించే చాలా మంది మనసులో ఏదో ఒక మూల మంచితనం ఉంటుంది. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మంచితనాన్ని లోపలే దాచేసి పైకి కోపాన్ని, అహాన్ని ప్రదర్శిస్తుంటారు. ఆ ముసుగు తొలగిపోయే సందర్భాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మార్పు తీసుకొచ్చేందుకు పెద్ద సంఘటనలు, అనుభవాలే కారణం కావాల్సిన అవసరం కూడా లేదు. వయసులో చిన్నవారి నుంచి కూడా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చునని హృద్యంగా దర్శకుడు ఈ సినిమాలో చూపించారు.
ఓ మనిషిపై అకారణమైన ద్వేషం, శత్రుత్వం...మరో శత్రువునే తయారు చేస్తుంది. ఎదుటివారితో మనం ఎలా ప్రవర్తిస్తే వారి నుంచి ఎలాంటి ప్రవర్తనే తిరిగి వస్తుందని క్లైమాక్స్‌లో మెసేజ్ ఇచ్చారు. అందరిని భయపెట్టాలని చూసే ఓ రౌడీకే కొట్టకుండా, తిట్టకుండా ఓ చిన్న కుర్రాడు ఎలా భయాన్ని రుచిచూపించాడు? అతడిలో మార్పుకు ఏ విధంగా కారణమయ్యాడన్నది ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది.
జీవించారు...
బత్తాలో ఎవరిది నటన అనే భావన కలగదు. తమ పాత్రల్లో జీవించారు. బత్తా అనే రౌడీగా విజయ్ సేతుపతి మరోసారి తన నట విశ్వరూపం చూపించారు. విజయ్ సేతుపతి భార్యగా లిజోమోల్ జోస్ కణిమ పాత్రలో ఒదిగిపోయింది. ఈ సినిమాకు మాస్టర్ పృథ్వీరాజ్ నటన హైలైట్‌గా నిలిచింది. అమాయకత్వం, మంచితనం కలబోసిన చిన్నారి పాత్రకు న్యాయం చేశాడు. విజయ్ సేతుపతి, పృథ్వీరాజ్ కాంబినేషన్‌లో వచ్చే సీన్లు ఆకట్టుకుంటాయి. తెలుగు డబ్బింగ్ బాగుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rababaali OTT | థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీలోకి రణబాలి – విజయ్, రష్మిక సినిమా స్ట్రీమింగ్ డేట్ లీక్
నవంబర్ 2, 2026

Immortal Movie Review | రక్తం తాగే ఏలియన్ అందమైన అమ్మాయిగా మారితే – కయదు లోహర్ హారర్ మూవీ ఎలా ఉందంటే?
నవంబర్ 1, 2026

Ott Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే – తెలుగు సినిమాలు హైలైట్…
అక్టోబర్ 30, 2026
తాజావార్తలు
- ●Indian sailor | ఒమన్ తీరంలో భారతీయ నౌకపై దాడి.. గుజరాత్ నావికుడు మృతి
- ●Helicopters Collide In Nepal | రెండు హెలికాప్టర్లు ఢీ.. భారతీయుడు మృతి
- ●Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. పసిడిపై ఆసక్తి తగ్గుతుందా..?
- ●LIC | పిల్లల భవిష్యత్తు కోసం రూ.30 లక్షలు.. ఎల్ఐసీ పాలసీలతో సాధ్యమేనా..?
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోరు.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..
- ●Komatireddy Rajagopal Reddy | అధికారంలో ఉండి ప్రతిపక్ష ఎమ్మెల్యేలాగా నిధులు అడగాల్సి వస్తుంది

Indian sailor | ఒమన్ తీరంలో భారతీయ నౌకపై దాడి.. గుజరాత్ నావికుడు మృతి

Helicopters Collide In Nepal | రెండు హెలికాప్టర్లు ఢీ.. భారతీయుడు మృతి

Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. పసిడిపై ఆసక్తి తగ్గుతుందా..?

LIC | పిల్లల భవిష్యత్తు కోసం రూ.30 లక్షలు.. ఎల్ఐసీ పాలసీలతో సాధ్యమేనా..?



