Jagadish Reddy | తెలంగాణ నీటి హక్కులను కాపాడటంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి విఫలం: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
Jagadish Reddy | సమైక్య పాలనలో తెలంగాణ (Telangana) నీటిని ఆంధ్రప్రదేశ్‌కు ఎలాగైతే తరలించుకుపోయారో.. ఇప్పుడు కూడా అవే పరిస్థితులు పునరావృతమవుతున్నాయని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. 2026 ఆగస్టు 4న నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) జలాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
Jagadish Reddy | త్రినేత్ర న్యూస్: సమైక్య పాలనలో తెలంగాణ (Telangana) నీటిని ఆంధ్రప్రదేశ్‌కు ఎలాగైతే తరలించుకుపోయారో.. ఇప్పుడు కూడా అవే పరిస్థితులు పునరావృతమవుతున్నాయని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. 2026 ఆగస్టు 4న నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) జలాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన నీటి వనరులపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంటే సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారని నిలదీశారు. నల్లగొండ జిల్లా గట్టుప్పల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ నీటి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 4న జీవో విడుదల చేస్తే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న చర్యలేమిటి?. కేఆర్ఎంబీ (KRMB)కి ఎప్పుడు ఫిర్యాదు చేశారు?. ఏ తేదీన లేఖ రాశారు?. ఆ లేఖలో ఏమి పేర్కొన్నారు?. దానిపై కేఆర్ఎంబీ స్పందన ఏమిటి? ఈ వివరాలన్నింటినీ ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. లేఖ రాశానని చెప్పడం కాదు, ఆ లేఖను బహిర్గతం చేసే దమ్ముండాలని చెప్పారు. లేనట్లయితే జిల్లా ప్రజలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. పల్నాడు జిల్లా విజయపురి సౌత్ వద్ద ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేకపోయిందని ప్రశ్నించారు. ఏడాది కాలంగా జరుగుతున్న పరిణామాలపై మంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు.
ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి అవసరాల కోసం చర్యలు తీసుకుంటుంటే, మరోవైపు తెలంగాణలో క్రాప్ హాలిడే ప్రకటించడం కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Govt) ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. మన నీళ్లను మన రైతులకు అందించలేని అసమర్థ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకని ప్రశ్నించారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు వేర్వేరు ప్రకటనలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని, ఇద్దరిలో ఎవరి మాట నిజమో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుతో (Chandrabadbu Naidu) రాజకీయ సాన్నిహిత్యం కోసం తెలంగాణ రైతుల ప్రయోజనాలను బలిపెట్టే ప్రయత్నాలను సహించేది లేదని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా స్పందించి తెలంగాణ నీటి హక్కులపై తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ (BRS) ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉందని చెప్పారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేసి, ప్రజలను, రైతులను సమీకరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. తెలంగాణకు దక్కాల్సిన ప్రతి నీటి బొట్టును కాపాడుకునే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. తెలంగాణ నీళ్లు తెలంగాణకే.. తెలంగాణ రైతుల హక్కుల విషయంలో రాజీ ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
- ●CM Yogi Adityanath | యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మాతృవియోగం
- ●Rahul Gandhi | రాజీపడిన ప్రధాని ఎప్పటికీ అక్కడ కూర్చోలేరు.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు
- ●Gold Prices | భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. కారణాలేమిటి..?
- ●Cheyutha Pensions | అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాలి..
- ●Mahesh Goud | కోట నీలిమపై అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు అనైతికం...: మహేశ్ గౌడ్
- ●EPFO | పీఎఫ్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఇక 2 నెలల్లోనే నగదు..

CM Yogi Adityanath | యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మాతృవియోగం

Rahul Gandhi | రాజీపడిన ప్రధాని ఎప్పటికీ అక్కడ కూర్చోలేరు.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు

Gold Prices | భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. కారణాలేమిటి..?

Cheyutha Pensions | అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాలి..






